Bjp will make more attempts to form government in delhi

AAP, Arvind Kejriwal, BJP, MLA's, delhi assembly, modi, amit shah

bjp will make more attempts to form government in delhi

అమ్మడుపోతున్న అప్ ఎమ్మెల్యేలు..?

Posted: 09/24/2014 04:03 PM IST
Bjp will make more attempts to form government in delhi

దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని చేపట్టేందుక కేంద్రంలోని బీజేపి సర్కార్ ప్రణాళికలు రచిస్తుంది. కేంద్రంతో పాటు ఢిల్లీలోను తమకు అధికారం లభిస్తే అడ్డే వుండదని భావిస్తోంది. ఇందుక తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల కోసం ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది సభ్యులలో చీలిక రాదని తెలసిన బీజేపి.. ఆమ్ ఆద్మీ పార్టీపై గురిపెట్టిందని సమాచారం. ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపి ప్రలోభాలకు గురిచేస్తోందని అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

జన లోక్ పాల్ బిల్లుకు మద్దతు లభించకపోవడంతో పదవులతో పాటు ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఢిల్లీలో ఫిబ్రవరి 14న, అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తన పాలన కొనసాగుతూ ఎనమిది నెలలు అవుతున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇంకా రాష్ట్రపతి పచ్చజెండా ఊపలేదు. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్..  ప్రభుత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపికి అవకాశం ఇవ్వాలని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రికి మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం కూడా ఇదే అవుతుందని, ఈ క్రమంలో బీజేపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాష్ట్రపతి ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే గనక జరిగితే.. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో 32 స్థానాలను సంపాదించిన బీజేపి.. గవర్నర్ ఆదేశానుసారం నిర్ణీత గడుపులోపు ప్రభుత్వ బలాన్నిచూపాల్సి వుంటుంది. ఈ తరుణంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో బీజేపి నేతలు వున్నారని తెలుస్తోంది.

తమ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు పేదవారని.. ఆ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందని  అరవింద్ కేజ్రీవాల్ అరోపించడం వెనుక నిజాలు లేకపోలేదు. ఒక్కో ఆప్ ఎమ్మెల్యే కు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఢిల్లీలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. కొంతమంది ఆప్ ఎమ్మెల్యేలు కమల నేతలను కలిసినా.. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు తెలపలేరన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే అవినీతి నిర్మూలణ, అక్రమాల నివారణకు ఉద్భవించిన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అమ్మడు పోతారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. వ్యక్తిత్యాలు, నిజాయితీ వున్న వ్యక్తులనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేశామని చెబుతున్న ఆప్.. అమ్మడు పోతున్న వార్తలతో ప్రజల్లోకి రావడం కలకలం రేపుతోంది. పార్టీ ఉద్దేశ్యాలను, ఉద్భవించిన తీరును మరచి ఎమ్మల్యేలు అమ్మడుపోతారా..? అన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు తమ ఎమ్మెల్యేలను వెనకేసుకు వస్తూ.. తమ ఎమ్మెల్యేలలో పేదవారు ఉన్నారు.. వారు ప్రలోభాలకు లోంగే అవకాశముందని వ్యాఖ్యానించడం కూడా సహేతుకం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Arvind Kejriwal  BJP  MLA's  delhi assembly  modi  amit shah  

Other Articles