Polavaram fight division of congress party rajya sabha mps

polavara fight, Division of Congress party Rajya Sabha mps, Andhra mps, telangana mps, polavaram ordinance, polavaram bill, congress party, trs party, Rajya Sabha, Polavaram ordinance Bill Passed,

polavara fight Division of Congress party Rajya Sabha mps, Division of Andhra Pradesh Rajya Sabha Members, Polavaram fight, Parliament passes bill on Polavaram project, polavaram ordinance, Ordinance on Khammam

వరం కోసం చీలిపోయిన కాంగ్రెస్ ఎంపీలు?

Posted: 07/15/2014 03:21 PM IST
Polavaram fight division of congress party rajya sabha mps

ప్రాంతాలు వేరైన .. పార్టీలు ఒక్కటే అని .. ఆయా పార్టీల అధినేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజనతో.. తెలుగు రాష్ట్రాలలో హస్తం పార్టీ కోనఊపీరిలో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ రాష్ట్రం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గా విడిపోయిన తరువాత.. వివాదలు కొత్తగా పుట్టుకొచ్చాయి. నీటి వివాదం, కరెంట్ మంటలతో పాటు కొత్త పోలవరం ప్రాజెక్ట్ యుద్దం నడుస్తున్నా విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ పై ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం పై రచ్చ మొదలైంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు మాటల యుద్దం చేయటం మొదలుపెట్టారు. దీంతో లోక్ నుండి రాజ్య సభ వరకు పోలవరం మీద పైటు జరిగింది.

పోలవరం ఇష్యూ కాంగ్రెస్ లో మళ్ళీ ప్రాంతీయ చిచ్చు తెచ్చి పెట్టింది. ఆ ఇష్యూ మీద రాజ్యసభలో చర్చ మొదలైనపుడు….ఆంధ్రా ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తమ తమ రాష్ట్రాలకు అనుకూలంగానే మాట్లాడారు తప్ప.. తాము ఒకటే పార్టీకి చెందిన వాళ్ళమనే మాట మర్చిపోయారు.

పోలవరాన్ని తాను సపోర్ఠ్ చేస్తున్నానని.. డిజైన్ మార్చాల్సిన అవసరం లేదని జైరాం రమేష్ అంటే, దానికి ఒప్పుకోను పొమ్మన్నారు రాపోలు ఆనంద్ భాస్కర్. పోలవరం ఆంధ్రాకు వరం కాదనీ, ఆ ప్రాజెక్టు కడితే ఆ రాష్ట్రానికి శాపంగా మారుతుందనన్నారు. తరువాత మాట్లాడిన వీహెచ్ హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా గిరిజనులను ముంచొద్దనీ, పోలవరం డిజైన్ మార్చాలని అన్నారు. సీమాంధ్రకు చెందిన చిరంజీవి, కేవీపీ పోలవరానికి అనుకూలంగా మాట్లాడారు.

టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని విరుకునపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. రాజ్యసభలో ఆంద్రఎంపీలు, తెలంగాణ ఎంపీలు విడిపోవటంతో సహజమే. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఆంద్రఎంపీలు , తెలంగాణ ఎంపీలుగా విడిపోయి రాజ్యసభలో తెలుగు రచ్చ ఏమిటో చూపించారు. దీంతో మిగిలిన రాష్ట్రల ఎంపీలు గతంలో రాష్ట్ర విభజన లోల్లి, ఇప్పుడు పోలవరం లోల్లి , ఈ తెలుగోళ్ల లోల్లి ఎప్పుడు ముగుస్తుందోనని జోకులు వేసుకుంటూ రాజ్యసభలోనే నవ్వుకుంటున్నారు. తెలుగు ఎంపీలు మాత్రం ప్రాంతాల వారిగా, పార్టీలు వారిగా చీలిపోయి అరుసుకోవటం కొంచెం బాధగానే ఉందని ..తెలుగు ప్రజలు అంటున్నారు. కేవలం వరం కోసమే పార్టీ ఎంపీలు రెండుగా చీలిపోవాలా? అని కాంగ్రెస్ పార్టీలోని సినియర్ నేతలు మండిపడుతున్నారు.

అసలే కోన ఊపీరితో అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా సమాధులు కట్టే రోజులు వచ్చాయని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అంటున్నారు. మీవల్లే ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రాములు ఆంద్రలో కలిసాయని ఒకరిపై ఒకరు బురద నీళ్లు చల్లుకున్నారు. ఇదే మంచి అవకావంగా భావించి టీఆర్ఎస్ నేతలు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక గులాబీ దెబ్బల నుండి హస్తం ఎలా బయటపడుతుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles