marriage problems in vijayawada city, unmarried mens, unmarried mens in andhra pradesh, Vijayawada Newsunmarried boys looking a nice young girls, ap cm, chandrababu naidu, apngo ashok babu, vijayawada muncipal corporation, marriage, Vijayawada News, Vijayawada - City News, Vijayawada Latest

marriage problems in vijayawada city, unmarried mens in andhra pradesh, Vijayawada News, Vijayawada - City News

బాబు నగరంలో పెళ్లి కాని ప్రసాదులు గోల!

Posted: 07/15/2014 04:34 PM IST

నాకు పెళ్లెప్పుడవుతుంది బాబు..నాకు పిల్లయాడ దొరుకుంతుంది బాబు..  ఒక సినీ కవి  అమ్మాయి కాపురం  సినిమాకు పాట రాయటం జరిగింది.  ఇప్పుడు అదే పాటను.. పెళ్లికానీ ప్రసాదులు  అందరు పాడుకుంటున్నారు.  అదీ తెలుగు రాష్ట్రంలోనే   పెళ్లికానీ ప్రసాదులు పెరిగి పోతున్నారు.  తెలంగాణలో  మాత్రం  కాదులేండి.  పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని  విజయవాడ సిటీలో  పెళ్లికానీ ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. అదీ కూడా   జాబ్ చేస్తున్న వారికే  పెళ్లి కష్టాలు వచ్చాయి.  గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న పిల్లనిచ్చే నాధుడే  లేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని   సిటీ అధికారులు అంటున్నారు.

విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో వందలాది మంది యువకులు కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి కన్యాదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పేరుకు గవర్నమెంటు సంస్థలో పనిచేస్తున్నా... పెళ్లి కావడం లేదెందుకని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది జీతాలను సక్రమంగా అందుకోవడం లేదు. జీతాలివ్వాలంటూ వారు తరచుగా చేసే ధర్నాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి చూపులకు వెళ్లిన యువకులకు ‘మ్యాచ్ ఫిక్స్’ కావడం లేదు. ‘జీతాలు సక్రమంగా రాని మీరు మా అమ్మాయిని ఎలా పోషిస్తారు?’ అని ఆడపిల్లల తండ్రులు అడిగే ప్రశ్నలకు వీరు సమాధానం చెప్పలేకపోతున్నారు.

విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే పెళ్లి కాని ప్రసాదుల గురించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఆయన ఏపీఎన్జీవోల అభినందన సభలో హామీ ఇచ్చారు. ఇప్పటికే  బాబు గారికి అనేక సమస్యలు ఉన్నాయి వాటిల్లో   పెళ్లికానీ ప్రసాదుల సమస్య ఒకటి గా భావించి .. న్యాయం చేస్తే.. పెళ్లి చేసుకోని  హాయిగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో  మళ్లీ మీకే ఓటేసి గెలిపించుకుంటామని  పెళ్లికానీ ప్రసాదులు  చంద్రబాబుని వేడుకుంటున్నారు.  ఇక చంద్రబాబు  పెళ్లికానీ ప్రసాదుల  సమస్యలను ఎలా తీర్చుతాడో  చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles