దేశ అభివృద్ధి .. ప్రదాని మంత్రి నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చిన మోదీ మంత్రులతో పరుగులు తీయిస్తున్నారు. నలభై ఎనిమిది గంటల్లో రెండు కేబినెట్ సమావేశాలు జరిపిన ఆయన తన మంత్రులకు పది ప్రాధాన్యతలు నిర్ణయించి వాటిని సాధించేందుకు వంద రోజుల గడువు నిర్థారించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే ప్రచారం చేసిన అభివృద్ధి రాజకీయాల ప్రాధాన్యతాంశాలను ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసింది. పారదర్శకత, వినూత్న ఆలోచనలు, సామర్ధ్యం, సుస్థిరత వంటి తొలి 10 సూత్రాలు.
ఎ) బ్యూరోక్రసిలో విశ్వాసాన్ని పెంపొందించడం.
బి) వినూత్న ఆలోచనలను స్వాగతించడం..అధికారులకు విధినిర్వహణలో స్వేచ్ఛను కల్పించడం.
సి) విద్య, ఆరోగ్యం, నీరు, ఇంధనం, రోడ్లు.
డి) ప్రభుత్వంలో పారదర్శకత, ఇ-వేలంను ప్రోత్సహించడం.
ఈ) అంతర్ మంత్రిత్వశాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు.
ఎఫ్) ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజా దృష్టికోణ విధానం అవలంబించడం.
జి) ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంక్షోభాన్ని అధిగమించడం.
హెచ్) మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులలో సంస్కరణలు. నిర్ణీత కాల వ్యవధిలో విధానాల అమలు.
ఐ) ప్రభుత్వ విధానాలలో సుస్థిరత, మనుగడ సాధించడం.
మంత్రులకు మోదీ దిశా నిర్దేశం చేయటం జరిగింది. మన పాలనకు పదును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే లక్ష్యాల్లో విఫలం కాకూడదనీ తన మంత్రులకు హెచ్చరికలు చేయటం జరిగింది. ఈ వంద రోజుల వ్యవధిలో మంత్రులందరూ తమ కార్యక్రమాలను నిర్ణయించుకుని వాటిని పూర్తి చేయాలని మోదీ ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో విఫలం కాకూడదని మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
గుజరాత్‌లో సాధించినటువంటి అభివృద్ధిని దేశంలోని ఆన్ని రాష్ట్రాల్లో సాధించేందుకు అహర్నిశలు పని చేయవలసిందేనని మంత్రులకు మోదీ ఉపదేశించారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఆర్థిక, వౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన శాఖలపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజలకు లాభం కలుగజేసే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. అభివృద్ది సాధనకు ఉద్దేశించిన పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సమర్థంగా సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకునే అధికారులు వేధింపులకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అధికారులకు విశ్వాసం కలిగించినప్పుడే పథకాలు సమర్థంగా అమలు జరుగుతాయని నరేంద్ర మోదీ భావిస్తున్నారు.
దేశంలో మానవ వనరుల అభివృద్దికి విద్య, వైద్యం, ఆరోగ్య శాఖలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం సిద్దం అవుతోంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వేగిర పరచటం ద్వారా అభివృద్ది పథకాలు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని మోదీ తమ మంత్రులందరికి సూచించారు.
పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటంతోపాటు అవి ముందు నిర్దారించిన సమయం ప్రకారం పూర్తి అయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరు, పథకాల అమలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని మోదీ సూచించినట్లు తెలిసింది. సాంకేతిక పరిజానంతోపాటు సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవటం ద్వారా పథకాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. సుపరిపాలన, సకాలంలో పథకాలను పూర్తి చేయటం ద్వారా ప్రజలకు అభివృద్ది ఫలాలు అందటంపై మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని మోదీ అందరు మంత్రులను ఆదేశించారు.
కొత్త లక్ష్యాలతో ముందుకు సాగడంతో పాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన ప్రాధాన్యతాంశాలపైనా దృష్టి పెట్టాలని మోదీ భావిస్తున్నారు. సహాయ మంత్రులను కూడా పరిగణనలోకి తీసుకుని వారికీ పనిలో ప్రమేయం కల్పించాలని కేబినెట్ మంత్రుల్ని కోరారు. మంత్రులందరినీ తాను ఇక నుంచి కలుస్తూనే ఉంటానని, అలాగే కార్యదర్శులతో కూడా వ్యక్తిగతంగా సమావేశమవుతానని రెండో కేబినెట్ భేటీలో మోదీ స్పష్టం చేశారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more