Kcr colour change in life sentiment

kcr colour change, kcr colour change in life sentiment, kcr new colour,kcr used in white car, cm kcr used in black car, Telangana state cm kcr, kcr latest news, kcr latest comments, cm kcr, telangana cm kcr, cm convoy, cm kcr convoy, trs party leaders.

kcr colour change in life sentiment, kcr used in white car, cm kcr used in black car,

రంగు మార్చిన కేసిఆర్?

Posted: 05/29/2014 06:04 PM IST
Kcr colour change in life sentiment

గులాబీ బాస్ ఇప్పుడు రంగు మార్చాడు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు భక్తి, పూజలు, వాస్తు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువని అందరికి తెలుసు. అయితే ఆయన పార్టీ కలర్ గులాబీ కలర్ అయినప్పటికి .. కేసిఆర్ మాత్రం తెలుపు రంగునే ఇష్టపడతాడని పార్టీలోని అతని ముఖ్య సన్నిహితులు అంటున్నారు. కేసిఆర్ నిత్యం వాడే దుస్తుల్లో కూడా సూపర్ తెలుపే కనబడతుంది. ఇప్పటి వరకు ఆయన కలర్ అంగీతో గానీ, కలర్ ప్యాంట్ గానీ కనిపించలేదు.

అంతేకాకుండా ఆయన చుట్టు ఉండే వాతవారణాన్ని కూడా తెలుపు రంగు, ఉండే విధంగా చూసుకుంటాడు. కేసిఆర్ తో నడిచే నాయకులు కూడా తెలుపు రంగు దుస్తులు ధరించే వస్తారు. అయితే కేసిఆర్ మొదటి సారిగా రంగు మార్చారు. కేసిఆర్ ఎప్పుడు తెలుపు కలర్ కారుల్లో తిరిగే ఆయన గత కొద్ది రోజుల నుండి .. కర్రె( నలుపు) రంగు కారుల్లో తిరుగుతున్నారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి కర్రె కారుల్లో కేసిఆర్ సిటీ మొత్తం తిరుగుతున్నారు.

kcr-colour-sentiment-2

kcr-colour-sentiment-1

ఇప్పటి వరకు ఈ కర్రె కారుల్లో .. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ కుమార్ రెడ్డి.. తిరిగిన వాళ్లే. ఈ ముగ్గురు ఉన్న సీఎం ఆఫీస్సు వాస్తు బాగలేదని చెప్పిన కేసిఆర్, వారు వాడిన నల్ల రంగు కార్లను ఎలా వాడుతున్నారో అర్థం కావటంలేదని ..తెలంగాణలోని వాస్తు తెలిసిన పండితులు జుట్టు పీక్కుంటున్నారు.

ఎప్పుడు సెంటిమెంట్ కు విలువ ఇచ్చే కేసిఆర్.. ఇప్పుడు తెలుపు రంగు కార్లను వదిలిపెట్టి, కర్రె కారుల్లో తిరగటం అందరికి ఆశ్చర్యంగా ఉంది. సెంటిమెంట్ ఉన్న ఓ తెలంగాణ వీరా ..ముందు ఆ నల్ల రంగు కార్లను అర్జెంట్ గా మార్చుకోకపోతే. గులాబీ రాజకీయ పరిస్థితి తారుమారు అవుతుందని..ఆయన పై అభిమానం ఉన్న జ్యోతిష్యులు చెబుతున్నారని ..పార్టీలోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఈ కర్రె కార్లను మార్చుతాని.. పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కానీ కేసిఆర్ ఈ నల్ల రంగు కార్ల కాన్వాయ్ లో వరుసగా వెళుతుంటే .. బాగుంది కదా అని, అలాగే కంటిన్యూ చేస్తోరో.. లేక సెంటిమెంటు ప్రకారం ..తెల్ల కార్లు తెచ్చుకుంటాడో చూద్దాం. మరి కొద్ది రోజుల్లో కేసిఆర్ రంగు మార్చుతాడో లేదో తెలిసిపోతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles