Telangana cm kcr vs seemandhra cm chandrabau naidu

kcr vs seemandhra cm chandrabau, telangana cm kcr vs seemandhra cm, cm kcr vs seemandhra cm chandrabau Naidu, telangana state, Seemandhra state, babu vs kcr.

telangana cm kcr vs seemandhra cm chandrabau Naidu

కేసిఆర్ కంటే చాలా వెనకబడిన చంద్రబాబు?

Posted: 05/28/2014 04:54 PM IST
Telangana cm kcr vs seemandhra cm chandrabau naidu

గురువు మంచి శిష్యుడుగా ..కేసిఆర్ దూసుకుపోతున్నారు. గురువైన చంద్రబాబు మాత్రం చాలా వెనకబడిపోయారు. రాజధాని లేని రాజ్యానికి చంద్రబాబు రాజు అయితే.., అన్ని హంగులు ఉన్న రాజధానికి రాజు అయ్యాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబోయే ముఖ్యమంత్రిగా కేసిఆర్ .. జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నారు.

అప్పులున్న రాజ్యంలో చంద్రబాబు , ఆదాయం వచ్చే రాజ్యంలో కేసిఆర్, సీమాంద్ర రాజదాని కోసం విరాళాలు కావాలని రెండు చేతులతో అడుగుతున్న బాబు, తెలంగాణ అభివ్రద్ది కోసం విరాళాలు ఇవ్వండని ఎనిమిది చేతులతో తెలంగాణ ప్రజలను అడుగుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నేతలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతి అంశాన్ని సీమాంద్రతో పోల్చుతున్నారు. ప్రతి అంశంలోను తెలంగాణ ముందు ఉంటే.. సీమాంద్ర వెనుకబడి ఉండటం విశేషం .

అంతేకాకుండా.. అపాయింటెడ్ డే జూన్ 2 రానున్న నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసిఆర్ అదే రోజు ప్రమాణస్వీకారం చేస్తుంటే.., మన చంద్రబాబు మాత్రం సీమాంద్ర ముఖ్యమంత్రిగా ఆరు రోజులు ఆలస్యంగా జూన్ 8న ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే.

కేసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన వెంటనే తన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవటానికి సిద్దమవుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మహానాడులో పుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు కేసిఆర్ కంటే చంద్రబాబు అన్నీ విషయాల్లో వెనకబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఐదేళ్లలో ఈ చంద్రాల మద్య అభివ్రద్ది పోటీ ఎలా ఉంటుందో, చివరకు ఎవరు ముందంజంలో ఉంటారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles