మీకు లాటరీ గురించి తెలుసా? లాటరీ అనేది కొంతమంది లో ఒక్కరే తగులుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజ్య సభ సభ్యులందరికి లాటరీ తగిలే అవకాశాలు చాలా మెండుగా ఉన్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. జూన్ రెండో తేది అతి వేగంగా ముంచుకోస్తున్న తరుణంలో.. సీమాంద్ర, తెలంగాణలోని రాజ్య సభ సభ్యులకు గుండెల్లో రైల్లు పరుగెత్తున్నాయి.
రాష్ట్ర విభజన ప్రక్రియ శరవేగంగా ముందకు వెళుతోంది. అన్నింటా విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఉద్యోగుల నుండి మొదలుకొని, ఆస్తులు, అప్పులు, నిధులు ఇలా ప్రతీదాంట్లోనూ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాకు వాటాల ప్రకారం విభజన జరుగుతుంది. ఇప్పటికే సెక్రటేరియట్లో, ఉద్యోగుల విభజనలో రోజుకో వివాదం కొసాగుతూనే ఉంది. అయితే రాజ్యసభలో టి బిల్లును తీవ్రంగా అడ్డుకున్న నేతలకు ఇప్పుడు గట్టి చిక్కు వచ్చిపడింది.
నిన్నటి వరకు తెలంగాణ కావాలని తెలంగాణ నేతలు, సమైక్యంద్ర కావాలని సీమాంద్ర నేతలు .. రాజ్యసభలో కొట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విభజనే వీరి పాలిట శపంగా మారిందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తెలంగాణ, సీమాంధ్ర రాజ్యసభ సభ్యుల్లో దడ పుట్టిస్తోంది. తమతమ రాష్ట్రాల ప్రాతినిధ్యంపై నేతల్లో ఉత్కంఠత నెలకొంది.
ఇప్పుడు రాజ్యసభ సభ్యులు .. తెలంగాణ వారు, సీమాంద్రలోను, సీమాంద్ర వారు ..తెలంగాణ ప్రాంతంలోకి మారుతున్నారు. దీంతో ఎంపీలు కేకే, సిఎం రమేష్, చిరంజీవీ, కేవీపీలు, పాల్వాయి, దేవేందర్‌గౌడ్ లాంటివారిలో కొత్త భయం పట్టుకుంది. ఇప్పుడు వారిని లాటరీ టెన్షన్ వారిని వెంటాడుతోంది. దీంతో వారికి విభజన అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రం నుండి 18 మంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఈమధ్యే అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఇక మిగిలిన 17 మందిలో, తొమ్మిది మంది తెలంగాణకు చెందిన వారుకాగా.. ఎనిమిది మంది సీమాంధ్ర ఎంపీలున్నారు.
తెలంగాణ వారిలో రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్, ఎంఏ ఖాన్, రేణుకాచౌదరి, వి. హనుమంతరావు, దేవేందర్ గౌడ్, గరికపాటి మోహన్ రావు, గుండు సుధారాణి ఉన్నారు.
సీమాంధ్ర నుండి చిరంజీవి, టి. సుబ్బిరామిరెడ్డి, కేవీపీ, జేడి శీలం, జైరాం రమేష్, సుజనాచౌదరీ, సీఎం రమేష్, సీతామహాలక్ష్మి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు.
అయితే ఇప్పుడు రాష్ట్ర విభజనలో భాగంగా ఎమ్మెల్యేల నిష్పత్తి ఆధారంగా తెలంగాణకు ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు 11మందిని కేటాయించాల్సి ఉంది. ఐతే ఇప్పటికే తెలంగాణాకు తొమ్మిదిమంది సభ్యులుండటంతో లాటరీ ద్వారా వీరి విభజనను పూర్తిచేయనున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో ఈ లాటరీని తీస్తారు.
ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులు 2016లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ అరుగురిలో, ఇద్దరిని తెలంగాణకు నలుగురిని సీమాంధ్రకు కేటాయించనున్నారు. ఇక 2018లో రిటైర్ అవుతున్న ఆరుగురిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముగ్గురి చొప్పున, ఇక 2020లో పదవికాలం పూర్తవుతున్న వారిలో ఇద్దరిని తెలంగాణకు, సీమాంధ్రకు నలుగురిని కేటాయించాల్సి ఉంది.
వీరిలో లాటరీ ద్వారా విభజించాల్సి వస్తుంది కాబట్టి.. ఈ 18 మందిలో ఎవరు ఏ రాష్ట్రం నుండి ప్రాతినధ్యం వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే ఇప్పుడు ఎంపీలను టెన్షన్ పుట్టిస్తోంది. నిన్నటి దాకా తెలంగాణ వాణిని బలంగా వినిపించిన కేకే, పాల్వాయి, రాపోలు, దేవెందర్ గౌడ్, వీహెచ్‌తో పాటు మిగతావారు లాటరీలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అవకాశం ఉంది.
అదే విధంగా..చిరంజీవి, కేవీపి, సిఎం రమేష్ లాంటి వారు తెలంగాణకు వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి నిన్నటి దాకా తెలంగాణ వాదాన్ని అటు సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తూ ప్రాంతాలవారీగా విడిపోయి వీధిపోరాటాలు చేశారు. అయితే, ఈ నేతలకు విభజన అంశం ఇప్పుడు తెగ టెన్షన్ పుట్టిస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more