Priyanka gandhi steps to congress party

Priyanka Gandhi steps to Congress party, Priyanka Gandhi Craze in Congress Party, Priyanka Gandhi, Congress party, Rahul gandhi, Sonia gandhi, Narendra modi, Congress party leaders demand, 2014 election.

Priyanka Gandhi steps to Congress party, Priyanka Gandhi Craze in Congress Party,

కాంగ్రెస్ లోకి ఆమె రావాలి?

Posted: 05/26/2014 04:27 PM IST
Priyanka gandhi steps to congress party

కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వస్తుంది, ఆమె రావాలి? ఆమె వస్తేనే పార్టీ బాగుంటుందని.. పార్టీలోని ముదిరిపోయిన తలకాయలు గోల చేస్తున్నారు. అమ్మ, కొడుకు పేరు తో పదేళ్ల పాటు.. రాజ్యమేలం. ఇక అమ్మ కొడుకు వల్ల కాదని తెలిపోయింది కాబట్టి.. ఇప్పుడు ఆమె రావాల్సిందే. దేశంలో విస్తున్న ‘నమో’ గాలిని తరిమికొట్టేందు ఆమె హస్తం తప్పనిసరిగా కావాల్సిందేనని హస్తం గుర్తు నాయకులు రాజకీయ భజన చేస్తున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బతినడంతో పార్టీలో అందరి వేళ్లూ రాహుల్ టీమ్నే చూపిస్తున్నాయి. ప్రత్యక్షంగానే రాహుల్ అడ్వైజర్స్ను టార్గెట్ చేస్తున్న సెకండ్ గ్రేడ్ లీడర్స్... పరోక్షంగా యువరాజుపైనా నిందలు మోపుతున్నారు. పార్టీలో ప్రియాంక పాత్రను పెంచాలంటూ.. రాహుల్ను సైడ్ చేసే ప్రయత్నాలు షురూ చేశారు. రాహుల్ సైడవడమే బెటరంటూ చెప్పకనే చెప్తున్నారు.

రాహుల్ సలహాదారులపై మాజీ ఎంపీ మిలింద్ దేవర్ నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల అనుభవం లేని నాయకుల వల్లే పార్టీకి ఈ గతి పట్టిందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాడర్, ఎంపీల అభిప్రాయాలు పట్టించుకోలేదని... రాహుల్ కు అసలు వాస్తవాలు తెలీకుండా చేశారని ఫైరయ్యారు. మాస్లో ఫాలోయింగ్ ఉన్న నేతలను పక్కకుపెట్టడం కూడ ప్రభావం చూపిందని విశ్లేషించారు.

ముఖ్యంగా జైరామ్ రమేష్.. హైకమాండు ను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. దీనికి రాజ్బబ్బర్, సత్యవత్ చతుర్వేది, ప్రియా దత్ కూడ కోరస్ కలిపారు. అధిష్టానానికి దగ్గరివ్యక్తిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియా సైతం పరోక్షంగా రాహుల్నే ఓటమికి కారణంగా చూపెడుతున్నారు. కమ్యునికేషన్ వైఫల్యమే పార్టీ కొంపముంచిందని విశ్లేషించారు.

Priyanka-Gandhi-2014

కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ... వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైందని తేల్చారు. కొత్త నాయకత్వానికి సమయం ఆసన్నమైందంటూ... పరోక్షంగా ప్రియాంక ఎంట్రీకి తలుపు తెరిచారు... సింధియా. పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చల్లోనూ ప్రియాంకనే ప్రిఫర్ చేస్తున్నారు... కాంగ్రెస్ నాయకులు. నానమ్మ ఇందిరా గాంధీని పోలిఉండడం... రాహుల్తో పోలిస్తే మాస్ అప్పీల్ ఎక్కువగా ఉండడం... ప్రియాంకకు అడ్వాంటేజెస్ అవుతాయన్నది కాంగ్రెస్ నేతల అంచనా. అమేథీ, రాయ్ బరేలీకే ఇంతవరకూ పరిమితమైన ప్రియాంక... ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలంటున్నారు హస్తం నేతలు.

ఓటమి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటామన్న రాహుల్, సోనియా నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ మీట్లో ఏకగ్రీవంగా తిరస్కరించినప్పటికీ... ప్రైవేట్ సంభాషణలో కాంగ్రెస్ నాయకులు ప్రియాంక రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. యూపీఏ-2లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవీథామస్ సైతం... పార్టీలో ప్రియాంక పాత్ర పెరగాలని బాహాటంగా కోరుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంకగాంధీనే హస్తం నేతలకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. మోడీ హవాను తట్టుకోవాలంటే.. ప్రియాంకగాంధీ రావాలని సోనియా గాంధీ పై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు ..ప్రియాంక గాంధీ ఇంటి ముందు సీనియర్ నేతలు ఆమె రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles