తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు.. గులాబీ దళపతి. మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో విలీనం చేస్తానని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ప్రక్రియ పూర్తిగా జరిగిపోయింది. కాబట్టి కేసిఆర్ పార్టీని విలీనం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన నేతలు చాలా మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని భాజన చేసి, తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన సీనియర్ రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు. అయితే కేసిఆర్ విలీనం తన పార్టీ నాయకులతో, తెలంగాణ ప్రజలు చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై..గానీ విలీనానికి నై..నై అని చెప్పటంతో.. కాంగ్రెస్ పెద్దలకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిపోయింది. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకొని ఆంద్రప్రదేశ్ బలం పుంజుకోవటానికి కష్టపడిన కాంగ్రెస్ పెద్దలకు ఉద్యమనేత కొట్టిన దెబ్బకు చెయి చచ్చుపడిపోయింది? దీంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు సోనియాగాంధీ వద్దకు వెళ్లటానికే భయపడుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
పదమూడు సంవత్సరాల తెలంగాణ ఉద్యమ నేతగా..బలం పెంచుకున్న కేసిఆర్. 2014 ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ..కానీ తెలంగాణ తెచ్చింది కేసిఆరే ’’ అనే నినాదాన్ని తెలంగాణ ప్రజల్లోకి పంపి..తన బలాన్ని రెట్టింపు చేసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వారికంటే.. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వారు గొప్పవారు కాబట్టి, 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బతప్పదని ఆ పార్టీ నాయకులే చాటుమాటుగా చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ బొమ్మ పెట్టుకొని తెలంగాణరాష్ట్రంలో గల్లీ గల్లీ తిరిగిన ఫలితం శూన్యం అనే భావనలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకుంటే.. ఆంద్రప్రదేశ్ లో కనుచూపుమేర కాంగ్రెస్ పార్టీ కనిపించదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అందుకే ఇటీవల చేరిన విజయశాంతి లాంటి వారు కూడా టీఆర్ఎస్ పార్టీ విలీనం చేయకపోతే.. నేను రాజీనామా చేస్తానని మీడియా ప్రకటనలు చేస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అటూ హైకమాండ్ కు చెప్పలేక.. ఇటూ టీఆర్ఎస్ పార్టీలోకి చేరలేక.. రెండింటికి చెడ్డా రేవడి మాదిరిగా మిగిలిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి ఓడిపోవటం కంటే.. సైలెంట్ గా ఉండటమే మంచిదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇదే గనుక జరిగితే.. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా కాలిపోయినట్లే అని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు.
‘‘కానీ కాంగ్రెస్ హైకామండ్ మాత్రం చచ్చినోడి పెళ్లికి వచ్చేందే కట్నం ’’అని సీమాంద్రలో, తెలంగాణాలో పోటీ చేయటానికి సిద్దంగా ఉంది. కానీ అభ్యర్థులే కాంగ్రెస్ కు దొరకటంలేదని కాంగ్రెస్ కార్యకర్తలే గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. ‘‘ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు 2014ఎన్నికల్లో ఓడిపోతాం అని తెలిసి కూడా .. అమ్మ ముందు మేకగాంభీర్యం చూపిస్తూ ’’ కాంగ్రెస్ హైకమాండ్ ముందు కలరింగ్ ఇస్తున్నారు.
ఏమైన ఇటలీ బొమ్మకు ..తెలంగాణ తెలుగుఉద్యమ దళపతి దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పూనాదులు కదిలిన మాట వాస్తవం. అప్పడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీలకు తెలుగువాడి సత్తా ఏమిటో చూపించారు. తెలుగువాడిని తక్కువుగా అంచనవేస్తే.. ఇలాగే అడ్రస్ మారిపోతుందని మరోసారి రుజువైందని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల తరువాత సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పేరు చాలా అరుదుగా వినిపిస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more