Ys jagan secrets meets with pawan kalyan

pawan kalyan, ys jagan, chandrababu naidu, tdp, ysrcp, congress party, bjp, ys jagan secrets meets with pawan kalyan, Pawan Kalyan New Political Party,

ys jagan secrets meets with pawan kalyan?

పవన్ కోసం జగన్ పోరాటం?

Posted: 03/04/2014 08:11 PM IST
Ys jagan secrets meets with pawan kalyan

టన్నుల కొద్ది ఇమేజ్ ఉంది. జెట్ స్పీడ్ లా చురుకుతనం ఆయన లో పుష్కలంగా, టన్నుల మెగా వాల్ట్ ల పవర్ ఆయన దాగి ఉంది, ఓయాసిస్సులా   ఓదార్పు ఉంది,  ఆకాశమంతా అభిమానం ఉంది, ఎవరెస్టు శిఖరంలో కనిపించే పొగరు కూడా ఉంది, హిమబిందువుల కరిగే  కన్నీళ్లు ఉన్నాయి. ఇంకా ఆయనలో చాలా అమూల్యమైన సుగుణాలు,  పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి  పవర్ ఉన్న వ్యక్తి .. పొలిటికల్స్ లో వస్తానని మీడియా ప్రకటన రావటంతో.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి పార్టీలు.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్  గాలం వేయటానికి రంగంలోకి దిగినట్లు సమాచారం.

నేషనల్ పార్టీలతో కేంద్ర మంత్రి కె. చిరంజీవితో  మంతనాలు జరుపుతున్నట్లు  సమచారం. అలాగే రాష్ట్రంలో ఉన్న  సైకిల్ గుర్తోళ్ళు,  కారు  గుర్తోళ్ళు,  ఫ్యాన్ గుర్తోళ్ళు, ఈల  గుర్తోళ్ళు, కంకి కొడవలి  గుర్తోళ్ళు,   సుత్తి   , కొడవలి  గుర్తోళ్ళు, మర్రిమాను గుర్తోళ్ళు,   తెర వెనుకపోటిపడతున్నట్లు సమాచారం.

 అయితే  ఈపార్టీలలో రెండు ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  సైకిల్  గుర్తు అధినేత చంద్రబాబు నాయుడు తన బావమరిది  నటుడు బాలయ్యతో.. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ టాక్ నడుస్తుంది.  గతంలో  కూడా  పవన్  టిడిపిలో చేరుతున్నాడనే వార్తలు వినిపించాయి.  మెగా అన్నయ్య నాగబాబుతో కూడా చంద్రబాబు  పార్టీ నాయకులు  చర్చలు జరుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలుఅంటున్నాయి. 

ఇక ఫ్యాన్ గుర్తు అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై  ద్రుష్టి పెట్టినట్లు సమాచారం.  ఫ్యాన్ పార్టీలోని సీనియర్ నాయకులు రంగంలోకి .. పవన్ కళ్యాణ్ కు  భారీ ఆఫర్ ఇవ్వటానికి సిద్దపడినట్లు టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాక  కోసం.. ఫ్యాన్ గుర్తు అధినేత జగన్  ఎంత ఖర్చైనా, పవన్ ఏమీ అడిగిన ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు  ఆ పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.   

ఇప్పటికే  ఫ్యాన్ పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది  పవన్ కళ్యాణ్ తో సంప్రదించి, నిరాశతో  వెనుదిరిగినట్లు  సమాచారం.  ఈ విషయం తెలుసుకున్న  జగన్ ..త్వరలో పవన్ కళ్యాణ్ తో  రహస్య భేటి కావటానికి సిద్దమవుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.  

రాష్ట్రంలోని మిగిలిన పార్టీలు  మాత్రం పవన్  కళ్యాణ్  మా పార్టీలోకి వస్తే ..పగ్గాలిస్తాం, పదవులు  ఇస్తాం అని  మీడియా ప్రకటనలు చేస్తున్నారు.   వైఎస్ జగన్  నేరుగా రంగంలోకి  పవన్ కళ్యాణ్  ను దక్కించుకోవటానికి  శతవిధాల పోరాటం చేస్తున్నాడని   జగన్ పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

‘‘పవన్ కళ్యాణ్ పవర్ ఏ రాజకీయ పార్టీకి దక్కుతుందో? పవనే సొంతగా తన పవర్ ను వినియోగించుకుంటాడో తెలుసుకోవాలంటే  అతి కొద్దిరోజులు  ఆగాల్సిందే. ’’

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles