Money need in politics

money need in politics, Professor John Echeverri-Gent, Banaras Hindu University, University of Virginia

money need in politics

రాజకీయాలలో డబ్బు అవసరమే!

Posted: 01/09/2014 12:11 PM IST
Money need in politics

డబ్బుతో రాజకీయాలలో నెగ్గుకురాలేరు కానీ డబ్బు లేకపోతే అసలే నెగ్గలేరు అని అమెరికాకు చెందిన ప్రొఫెసర్ అధ్యయనం చేసి వెల్లడించగా దాన్ని వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రచురించబోతోంది. 

ప్రొఫెసర్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రస్తుతమున్న రాజకీయనాయకులలో ధనికవర్గానికి చెందినవారికే రానున్న ఎన్నికలలో గెలవటానికి 75 రెట్లు ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది.  ఎన్నికలకు నిధులు పోగుచెయ్యటం, వాటి వితరణ ఖర్చులు మొదలైన అంశాల మీద వెల్లడి చేసిన అధ్యయన ఫలితాలలో ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న నాయకులలో ఎవరి బలం ఎంతుంది,     ఎవరి బలహీనతలేమిటన్న విషయాలను చర్చించటం జరిగింది. 

అధ్యయనంలో 2009 సాధారణ ఎన్నికలను తీసుకుని చూడటమే కాకుండా ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల అంచనా కూడా వెయ్యటం జరిగింది.

పార్లమెంటు ఎన్నికైన ప్రజాప్రతినిధులలో 33 శాతం ఐదు కోట్లు లేక అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులున్నవారని, అందుకు వ్యతిరేకంగా అట్టడుగున చూస్తే 10 లక్షలు లేక అంతకంటే తక్కువ విలువైన ఆస్తులు కలవారు కేవలం 0.44 శాతం గెలుపొందారని తెలియజేసారు.  ఈ మధ్యలో 50 లక్షలకు పైన 5 కోట్లకు దిగువన ఉన్నవారు 19 శాతం విజయం సాధించారు.  10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆస్తిపాస్తులున్న రాజకీయ నాయకులు 94 శాతం ఓటమి పాలయ్యారని కూడా అధ్యయనం తెలియజేస్తోంది. 

పై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జాన్ ఎకావెరీ జెంట్ 1974 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles