Rahul promises to bring petrol, diesel under GST జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజీల్ తీసుకువస్తాం: రాహుల్ గాంధీ

Rahul gandhi promises of bringing petrol and diesel under gst

Rahul Gandhi, congress new poll promise, congress gst on oil prices, oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price, Petrol GST, Diesel GST, GST on Fuel, international market

Congress chief Rahul Gandhi promised that if his party is voted to power it will bring petrol and diesel within the ambit of the GST and will try and reduce rising prices.

వాహనదారులూ.. విన్నారా.. రాహుల్ గాంధీ నయా హామీ అదుర్స్..

Posted: 05/09/2019 04:23 PM IST
Rahul gandhi promises of bringing petrol and diesel under gst

పెట్రోల్, డీజిల్ ధరలు గత ఐదేళ్ల కాలంలో ఆల్ టైం హై రికార్డ్ ను తాకింది. ఈ రేటు రూ.80కి చేరిందన్న సమయంలో.. ఆ తరువాత రూ. 87 ను చేరుకున్న తరుణంలో.. ఇక రూ.90కి చేరువగా వెళ్లిందన్న సమయం.. ఇలా పెట్రోల్ ధర పెరింగిందన్న ప్రతీసారి.. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ మీడియా ముందుకు వచ్చి.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పేవారు. కానీ అచరణంలో ఏళ్లు గడిచినా.. అవి జీఎస్టీ పరిధిలోకి రాలేదు. ఎన్నికల వేళ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి జారుకున్నారు.

దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ దీనిపై కూడా ఎన్నికల హామీని ఇచ్చింది. వాహనదారులను కూడా అకర్షించేందుకు రాహుల్ గాంధీ ఇంధన ధరలపై అడ్డగోలు పన్నులు లేకుండా.. వాటిని ఒకే పన్ను విధానం కిందకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఊరట కలిగించేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని వాహనదారులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు.

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని, ఆయన మరోసారి ప్రధాని కాలేరని అన్నారు. కాపాలాదారుడే దొంగ(చౌకీదార్‌ చోర్‌ హై) అని తాను గానీ, కాంగ్రెస్‌ గానీ అనలేదని, మోదీ విధానాలతో దగాపడ్డ యువత, రైతులే ఆ నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. నోట్లరద్దు, జీఎస్టీ పేరుతో చాలామంది ఉద్యోగాలను ఊడగొట్టారని విమర్శించారు.

ప్రధాని మోదీ సహాయంతో దొంగలందరూ తమ నల్లధనాన్ని మార్చుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రాఫెల్‌ ఒప్పందంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా, ప్రధాని మోదీ పని ఇక అయిపోయినట్లేనని ట్వీట్‌ చేశారు. పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్‌)కు విశేష స్పందన వస్తోందని రాహుల్‌ అన్నారు. న్యాయ్‌కు ఆకర్షితులై యువతతో పాటు పెద్ద వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రె్‌సకు ఓటేస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : పెట్రోల్  డీజిల్ ధరలు గత ఐదేళ్ల కాలంలో ఆల్ టైం హై రికార్డ్ ను తాకింది. ఈ రేటు రూ.80కి చేరిందన్న సమయంలో.. ఆ తరువాత రూ. 87 ను చేరుకున్న తరుణంలో.. ఇక రూ.90కి చేరువగా వెళ్లిందన్న సమయం.. ఇలా పెట్రోల్ ధర పెరింగిందన్న ప్రతీసారి.. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ మీడియా ముందుకు వచ్చి.. త్వరలో పెట్రోల్  డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పేవారు. కానీ అచరణంలో ఏళ్లు గడిచినా.. అవి జీఎస్టీ పరిధిలోకి రాలేదు. ఎన్నికల వేళ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పి జారుకున్నారు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ దీనిపై కూడా ఎన్నికల హామీని ఇచ్చింది. వాహనదారులను కూడా అకర్షించేందుకు రాహుల్ గాంధీ ఇంధన ధరలపై అడ్డగోలు పన్నులు లేకుండా.. వాటిని ఒకే పన్ను విధానం కిందకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. పెరుగుతున్న పెట్రోల్‌  డీజిల్‌ ధరలు సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఊరట కలిగించేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని వాహనదారులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని  ఆయన మరోసారి ప్రధాని కాలేరని అన్నారు. కాపాలాదారుడే దొంగ(చౌకీదార్‌ చోర్‌ హై) అని తాను గానీ  కాంగ్రెస్‌ గానీ అనలేదని  మోదీ విధానాలతో దగాపడ్డ యువత  రైతులే ఆ నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. నోట్లరద్దు  జీఎస్టీ పేరుతో చాలామంది ఉద్యోగాలను ఊడగొట్టారని విమర్శించారు. ప్రధాని మోదీ సహాయంతో దొంగలందరూ తమ నల్లధనాన్ని మార్చుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రాఫెల్‌ ఒప్పందంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా  ప్రధాని మోదీ పని ఇక అయిపోయినట్లేనని ట్వీట్‌ చేశారు. పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్‌)కు విశేష స్పందన వస్తోందని రాహుల్‌ అన్నారు. న్యాయ్‌కు ఆకర్షితులై యువతతో పాటు పెద్ద వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రె్‌సకు ఓటేస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.  

Other Articles