Kerala Encourages Plastic Free Weddings

Kerala govt implements green protocol for weddings

Kerala, Kerala Weddings, Plastic Free Weddings, Kerala Green Protocol, Plastic Free Marriages, Kerala Green Protocol, Green Protocol Kerala, Indian Weddings Plastic Free

Kerala Government implements 'Green Protocol'. All Weddings are going to Plastic free Now.

పెళ్లిళ్లలో ఇక వాటిని వాడకండి

Posted: 06/07/2017 09:51 AM IST
Kerala govt implements green protocol for weddings

‘వాడి పడేయటం’ అన్న సులువు పద్ధతిని అనుసరించి మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా వేడుకలు, శుభకార్యాలకు వీటిని విరివిరిగా వాడుతూ వస్తున్నాం. అయితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న వీటిని క్రమక్రమంగా కనుమరుగు చేసే ఆలోచనను చేసింది కేరళ ప్రభుత్వం. ఇందుకోసం ‘గ్రీన్ ప్రోటోకాల్’ ను ప్రవేశపెట్టింది.

ఇక పై ఆ రాష్ట్రంలో జరిగే వివాహాల్లో ప్లాస్టిక్ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కఠిన నిబంధనలతో కూడిన ‘గ్రీన-ప్రొటోకాల్’ ను తీసుకువచ్చేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేటులే కాదు.. చివరకు, థర్మోకోల్ తో చేసే అలంకరణ వస్తువులను వినియోగించడానికి కూడా వీలు లేదు. వాటి బదులుగా స్టీలు, గాజు గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, ఆకులు వినియోగాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఈ ప్రొటోకాల్ ప్రకారం పెళ్లి చేసుకున్న జంటలకు ‘హరిత వివాహ పత్రం’కూడా ఇవ్వనున్నారు.

కాగా, కేరళలో పారిశుద్ధ్య వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ సుచిత్వ మిషన్’ ఈ ప్రొటోకాల్ ను కన్నూర్, ఎర్నాకుళం, కొల్లం, అలప్పుజ జిల్లాల్లో ప్రస్తుతం అమలు చేస్తోంది. ఆ తర్వాత కేరళ రాష్ట్ర మంతటా ‘గ్రీన-ప్రొటోకాల్’ ను అమలు చేయనున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావటంతో ఇఫ్తార్ లో కూడా ఈ నిబంధనను పాటించేందుకు ఇస్లాం సంఘాలు ముందుకు రావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Plastic Free Weddings  Green Protocol  

Other Articles