DMK raises doubts over stability of Tamil Nadu Government

Stalin on aiadmk three factions

Tamil Nadu Politics, Stalin AIADMK Factions, Stalin June 14, Stalin Palaniswami, DMK Chief Stalin, Palani swamy Stalin, Stalin Doubts on Palani swamy Govt, Palani swamy Govt Collapse, Palani swamy Dinakaran Panneerselvam, Tamil Nadu Assembly Session

It's doubtful if AIADMK govt will last till June 14 because of factions DMK Chief Stalin raise doubts. Says even though govt is there DMK Will Perform Democratic Duty he added.

మరో వారంలో ఆ సీఎంకు పెద్ద గండం!

Posted: 06/07/2017 10:17 AM IST
Stalin on aiadmk three factions

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా వీడిపోలేదు. పళని, పన్నీర్ వర్గాల కలయిక ఇంకా జరగకపోవటం, పైగా దినకరన్ దూకుడు చూపిస్తుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో వారంలోగా పళనికి పదవి గండం ఉందని, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయంటూ జోస్యం చెబుతున్నాడు.

కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌ లో స్టాలిన్ పైవ్యాఖ్యలు చేశాడు. ఈ నెల (జూన్ 14 నుంచి) అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దినకరన్, పళని, పన్నీర్ సెల్వం గ్రూప్ తగాదాలతో అన్నాడీఎంకే ఛిన్నాభిన్నం అయ్యింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే(అమ్మ) సర్కారు, మరో వారం రోజులైనా ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేశాడు.  వారం తర్వాత ప్రభుత్వం అలాగే ఉంటే మాత్రం ప్రతిపక్షంగా తమ పని తాము చేసుకుపోతుంటామని చెబుతున్నాడు.   

ఇప్పటికే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని, ఇంకా ఎన్ని ముక్కలుగా మారుతుందో ఊహించడం కష్టమని చెప్పిన ఆయన, డీఎంకే అధికారంలోకి వస్తే, సుపరిపాలనను ప్రజలకు చూపిస్తామని తెలిపారు. మంచి నీటి వసతుల కల్పనలో డీఎంకే ను కాపీ కొడుతున్న పళని స్వామికి పథకాల అమలు ఎలా చేయాలన్న దానిపై అస్సలు క్లారిటీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో అధికారం డీఎంకేదేనన్న ఆశాభావాన్ని స్టాలిన్ వ్యక్తం చేస్తున్నాడు. దినకరన్ కు కొందరు ఎమ్మెల్యేలు మద్ధతుగా నిలుస్తుండటంతో మళ్లీ చిన్నమ్మ క్యాంపు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  AIADMK Factions  Stalin  Assembly Session  

Other Articles