UP Chief Minister Yogi Adithyanath Backs RSS

Kashmir bengal and punjab was still india because of rss

RSS Yogi Adithyanath, Yogi Adithyanath Backs RSS, RSS Yogi Adithyanath, Pakistan Yogi Adithyanath, JDU RSS Yogi, Yogi Decisions RSS

Kashmir, Bengal and Punjab would have gone to Pakistan, had RSS not been there UP CM Yogi Adityanath said.

వాళ్లే లేకుంటే పాక్ లో కలిసిపోయేవాళ్లం!

Posted: 05/22/2017 08:55 AM IST
Kashmir bengal and punjab was still india because of rss

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యానాథ్ పగ్గాలు చేపట్టాక పాలనాపరంగా దుందుడుకు నిర్ణయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం కరుడుగట్టిన హిందుత్వ వాదిగా
ఉంటున్నాయన్నది ప్రతిపక్షాల ఆరోపణ. కేవల గై.. గంగ... గోరక్షక్ ఈ నినాదాలను మాత్రమే యోగి ప్రవేశపెడుతున్నాడని, స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకోని ఆరెస్సెస్ లాంటి వాళ్లకు కొమ్ము కాస్తున్నాడంటూ(జేడీయూ) తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డాయి. అయితే వీటిని అంతే త్వరగా రియాక్ట్ అయ్యాడు యోగి.

ఒకవేళ ఆర్ఎస్ఎస్ అనేది గనక లేకుంటే దేశంలోని ప్రధాన భూభాగం పాక్ లో కలిసిపోయి ఉండేదని వ్యాఖ్యానించాడు. ఆర్ఎస్ఎస్ దేశంలో అతిపెద్ద జాతీయవాద సంస్థ అని పేర్కొన్నారు. స్వయం సేవకులు, ప్రచారకుల సాయంతో దేశానికి, సంస్కృతికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రపంచంలోనే ఒకేఒక్క సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. ఆ సంస్థ లేదంటే ఆ సంస్థ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కనుక లేకుంటే పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పాకిస్థాన్‌లో అంతర్భాగం అయి ఉండేవన్నారు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఆశించకుండా ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా సేవలు అందిస్తోందని యోగి ప్రశంసించాడు. యోగి కామెంట్లపై మరో బీజేపీ నేత షైనా ఎన్సీ కూడా స్పందించింది. ఆ మూడు రాష్ట్రాల్లో ఎంత భిన్న సాంప్రదాయలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రాలు దాయాది దేశం పాలు కాకుండా కాపాడిన ఆర్ఎస్ఎస్ తో స్నేహం చేయటం తప్పేం కాదని వ్యాఖ్యానించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Yogi Adithyanath  Pakistan  

Other Articles