Andhra Pradesh Police Website Hacked

Ap police website hacked by cyber attackers

Andhra Pradesh State Police Netwoork, AP Police Website, AP Police Site Hack, AP Police Network Hack, Police Computers Hack, AP State Police Systems Hack, AP Police Website Hack

Andhra Pradesh State Police Network Hacked. Police try to trace who was the culprits behind this.

ఏపీ పోలీస్ నెట్ వర్క్ ను హ్యాక్ చేశారు

Posted: 05/13/2017 10:05 AM IST
Ap police website hacked by cyber attackers

హ్యాకర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పై పడ్డారు. శనివారం ఉదయం చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను పూర్తిగ స్తంభింపజేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

ఆయా జిల్లాల పరిధిలోని పీఎస్ లలో కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో విధులకు ఆటంకం కలిగింది. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉగ్రవాదుల పని ఉందా? లేక స్థానికంగా ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డీకోడింగ్ తోపాటు హ్యాకింగ్ జరిగిన ఐపీ అడ్రస్ ను ట్రెస్ చేసే పనిలో ఉన్నారు నిపుణులు. మొత్తం 25 శాతం కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులు ధృవీకరించారు.

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కర్ణాటకలో కూడా ఇదే తరహాలో హ్యాకింగ్ జరగ్గా, ప్రస్తుతం ఏపీ పోలీస్ శాఖ నెట్ వర్క్ కూడా అదే రీతిలో కావటంతో ఉగ్ర కోణం అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Police Network  Hack  

Other Articles