Mother Monkey Holding Her Unconscious Child

Monkey cries out for collapsed son

Indian photographer, Mother Monkey, Unconscious Baby Monkey, Avinash Lodhi, Avinash Lodhi Monkey Photo, Mother Monkey Holds Baby, Mother Monkey Cry, Emotional Monkey Photo, Emotional Mother Love Photo, Emotional Photo, Monkey Love Photo, Mother Monkey, Unconscious Baby Monkey, Monkey Heart Touching Photo, Jabalpur Monkey Photo Story

Indian photographer stunned as Monkey 'cries' after Baby's collapse. The heart-warming shot was taken by 31-year-old Avinash Lodhi in Jabalphur, Madhya Pradesh.

ఇదొక ఎమోషనల్ అమ్మ కథ

Posted: 05/13/2017 09:18 AM IST
Monkey cries out for collapsed son

31 ఏళ్ల అవినాష్ లోథీ మధ్యప్రదేశ్ బజల్ పూర్ కు చెందిన ఓ ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇక్కడ మన కోసం గత నెలలో తన కంటికి చిక్కిన ఓ ఫోటోతో మాటల్లో వర్ణించలేని అనుభూతిని అందిస్తున్నాడు. సరదాగా ఓ గూడెంకు వెళ్లిన అతను అక్కడి కోతుల గుంపును ఓ ఫోటో తీశాడు. అందులో ఓ తల్లి కోతి అతని హృదయం కరిగేలా చేసింది. అంతే వెంటనే ఫోటోను క్లిక్ మనిపించాడు.

అమ్మ ప్రేమను మించింది సృష్టిలో లేదు. మనుషులకు మాత్రమే కాదు జంతువుల్లో కూడా ఉంటుంది. సరదాగా కోతులన్నీ ఆడుకుంటుండగా అందులో ఓ పిల్ల కోతి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుంది. దానిని యథాస్థితికి తీసుకొచ్చేందుకు తల్లి కోతి చేసిన ప్రయత్నం, ఆ సమయంలో పిల్లకోతిని చేత్తో కాస్త పైకి లేపి తల్లి కోతి ఏడుస్తూ ఉండటం ఆ దృశ్యాలన్నీ అవినాశ్‌ తన కెమెరాతో క్లిక్‌ మనిపించారు.

ఆ కోతి పిల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాసేపటి తరువాత అది మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. అయితే తన పిల్లకి ఏమైందో అని తల్లికోతి పడిన ఆవేదన ఎలాంటి వారినైనా ఆందోళనకు గురిచేస్తుంది. వెయ్యి మాటల్లో వ్యక్తం చేయలేని భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పవచ్చు. మనుషులకైనా, జంతువులకైనా కన్నప్రేమ ఎలా ఉంటుందో ఈ ఒక్క ఫోటో సాక్ష్యం కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avinash Lodhi  Mother Monkey  Unconscious Baby  

Other Articles