Justice Karnan Sentences 5 Years Jail to SC judges

Karnan orders 5 years imprisonment for 8 sc judges

Justice Karnan, CJI Judges, Justice Karnan Supreme Court, Karnan Imprisonment, Kolkata Chief Justice, Kolkata High Court Judge, 5 Years Regirous, Supreme Court Judges Jail

Justice Karnan orders 5 years imprisonment for eight Supreme Court judges including CJI. Under SC ST Act Orders 5yrs Imprisonment

ఆ జడ్జి పగ మాములుగా లేదు కదా!

Posted: 05/09/2017 08:28 AM IST
Karnan orders 5 years imprisonment for 8 sc judges

వివాదాస్పద వైఖరితో ఏకంగా సుప్రీంకోర్టుతోనే పెట్టుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ మరో సంచలన ఆదేశాలు వెలువరించాడు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్కర్ తో పాటు, మరో ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ కర్ణన్ ప్రకటన చేశాడు. కర్ణన్ పగకు కారణం

ఓ దళిత జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష విధిస్తున్నట్టు కర్ణన్ ప్రకటించాడు. సుప్రీం కోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ పై ఈ ఏడాది మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయసంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీంకోర్టు బెంచ్ నాడు ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న కర్ణన్ డిమాండ్ ను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.

కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి నియమించిన వైద్యుల బ‌ృందం సమక్షంలో కర్ణన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ నెల 1వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, మానసిక వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన తిరస్కరించారు. తన మానసిక పరిస్థితి చాలా చక్కగా ఉందని ఆ వైద్యుల బృందానికి కర్ణన్ చెప్పడం జరిగింది. ఈ ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్ కర్ కు, ధర్మాసనంలోని జడ్జిలకే మతిస్థిమితం నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించాలని కర్ణన్ ఆదేశించాడు కూడా.

అయితే కర్ణన్ వ్యవహారం మరీ శృతి మించిపోతుండటంతో రంగంలోకి దిగిన సీనియర్ న్యాయవాది రాంజెఠల్మానీ న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని బహిరంగ లేఖలో కర్ణన్ ను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అతన్ని విధుల నుంచి మరో నెలలో రిలీవ్ చేయాలని సుప్రీం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice Karnan  Supreme Court  Chief Justice  Other Judges  5 Years Punishment  

Other Articles