Jesus-shaped cloud appears in sky వైరల్ వీడియో.. అకాశంలో ఏసుప్రభువు అకారం..

Jesus shaped cloud appears in sky after city ravaged by killer landslide

jesus shaped cloud in Colombia, jesus shaped cloud in colombia manizales, jesus shaped cloud after killer landslide, jesus shaped cloud after natural disaster, jesus shaped cloud on mountain, jesus shaped cloud on mt sancancio, Marya de Iesus jesus shaped cloud, viral video

Many residents of the Colombian city devastated by the natural disaster believed so. Images and a video footage of a Jesus-shaped cloud in the sky to comforted the residents had gone viral.

ITEMVIDEOS: వైరల్ వీడియో.. అకాశంలో ఏసుప్రభువు అకారం..

Posted: 04/27/2017 02:05 PM IST
Jesus shaped cloud appears in sky after city ravaged by killer landslide

ప్రకృతి ప్రకోపం తన పంజాను విసిన ప్రాంతమది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్థంభించగా, ఆ తరువాత కొండచరియలు విరిగిపడటంతో ఏకంగా 17 మంది ప్రాణాలు కొల్పోయిన ప్రాంతంలో స్థానికులంతా ఒక్కోక్కరుగా ఇళ్లను ఖాళీ చేసి సూదుర, సురక్షిత ప్రాంతానికి వలసవెళ్తున్న తరుణంలో వారికి ఒక అద్భుతం కనిపించింది. వర్షాలు, కొండచరియలు విరిగిపడి విషాదం నిండుకున్న ప్రాంతంలో ఒక్కసారిగా దైవనామస్మరణలు వినిపించాయి.

అంతేకాదు అక్కడ చోటుచేసుకున్న అద్భుత దృష్యాన్ని స్థానికులు తమ మెబైల్ ఫోన్ లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అపల్ లోడ్ చేయడంతో.. అ వీడియో ఏకంగా 28 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. అది కాస్తా వైరల్ గా మారడంతో ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతుంది. వేల మంది ఈ విడియోలను చూస్తు, షేర్ చేసుకుంటూ, కామెంట్లతో దైవమహిమ గొప్పదనాన్ని చాటుతున్నారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా నగరంలో గల మనిజేల్స్ ప్రాంతంలో అద్భుత సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఏమిటా అద్భుత సంఘటన.. అంటే ఏకంగా దైవాకారం కనిపించింది. బైబిల్ లో యహోను రాసిన ప్రకటన గ్రంధంలో 1.7 చెప్పినట్లుగా ఆయన మేఘారూఢుడై వచ్చేందుకు సన్నాహాలు చేసున్నాడన్నట్లు ఈ సంకేతాలను వెలువరించాడా..? ప్రభువును ప్రతి నేత్రము చూస్తారన్న ప్రకటనలో చెప్పినట్లుగానే ప్రభువు అకారాన్ని కొలంబియా వాసులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారని.. ఇక ప్రభువు అగమనం అసన్నమైందన్న వైరల్ వార్త ప్రపంచవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతుంది.

సరిగ్గా కోలంబియాలో కూడా ప్రకృతి విలయతాండవం తరువాత.. ఆకాశంలోని మేఘాల నుంచి జీసస్‌ను పోలిఉండే ఆకారం ద‌ర్శన‌మివ్వడంతో అక్కడి ప్రజ‌లు త‌మ‌ను ర‌క్షించేందుకే ప్రభువు వ‌చ్చాడ‌ని చెప్పుకుంటున్నారు. కొలంబియాలోని మ‌నిజేల్స్‌లో భారీ వ‌ర్షాలతో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి 17మంది చ‌నిపోయారు. త‌మ వారిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నవారికి అదే స‌మ‌యంలో శాన్కాన్సియో ప‌ర్వతంపైన మేఘాల నుంచి చీల్చుకుంటూ ఓ ఆకారం క‌నిపించింది. ఆ అకారాన్ని తీక్షణంగా చూసిన‌వారికి జీస‌స్‌లా క‌నిపించ‌డంతో ప్రభువే త‌మను కాపాడేందుకు వ‌చ్చాడ‌ని ఆనంద ప‌డ్డారు.

ఈ దృశ్యాల‌ను మ‌రియా డీ లీస‌స్ అనే మ‌హిళ త‌న కెమెరాతో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఈ వీడియో గ్లోబ‌ల్ వైర‌ల్‌గా మారింది. దీంతో ఐరోపా దేశాల్లో ప్రజ‌లు పెద్ద ఎత్తున ఈ విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. చాలామంది న‌జ‌రేతుడైన యేసుక్రీస్తు వ‌చ్చాడని కామెంట్స్ పెట్టారు. మ‌రికొంద‌రు యేసుక్రీస్తు రెండ‌వ‌రాక‌డ స‌మీపిస్తోంద‌నే చెప్పేందుకే ఈ సంకేతం అని కామెంట్ చేశారు.  మేఘాల్లో ఆ దృశ్యాన్ని చూసిన కొంద‌రు వెంట‌నే ప్రార్థన‌లు చేయ‌డం మొద‌లు పెట్టిన‌ట్లు వీడియోలో స్పష్టంగా క‌న‌బ‌డుతోంది. అయితే దీనిని హేతువాదులు కొట్టివేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lord Jesus  colombia  manizales  cloud  sunlight  mt sancancio  killer landslide  Marya de Iesus  viral video  

Other Articles