వాళ్ల పుట్టినరోజులకు సెలవులు ఎందుకు? | Yogi Opined why shut schools on birth anniversaries.

Yogi adityanath wants public holidays cut to size

Uttar Pradesh, Chief Minister, Yogi Adithyanath, Yogi Adityanath Mantra, Yogi Adityanath Public Holidays, Uttar Pradesh Public Holidays, Birth Death Anniversaries Holidays

Uttar Pradesh Chief Minister Yogi Adithyanath wants reduction in public holidays, targets schools at first.No school holidays on birth, death anniversaries of great personalities.220 days of teaching mandatory.

ప్రభుత్వ సెలవులను రద్దు చేసేసిన సీఎం

Posted: 04/15/2017 08:44 AM IST
Yogi adityanath wants public holidays cut to size

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోనే అత్యధిక సెలవులు అమలు చేస్తున్న రాష్ట్రంగా యూపీకి ఓ రికార్డు ఉంది. అయితే దానివల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున్న నష్టం వాటిల్లుతుందన్న భావనకు వచ్చిన యోగి వాటిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా ఆ పనని స్కూళ్ల దగ్గరి నుంచి మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.

శుక్రవారం క్యాబినెట్ మీటింగ్ అనంతరం మాట్లాడిన ఆయన గొప్ప వ్యక్తుల జయంతుల సందర్భంగా సెలవులు ఇవ్వటం ఇకపై జరగదని ప్రకటించేశాడు. ఆ రోజున పాఠశాలలో వారి గురించి ఓ రెండు గంటలపాటు పాఠాలు చెప్పించాలని, తద్వారా వారి గొప్పతనం వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని తెలిపాడు. 90వ దశకంలో కాన్సీరాం నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ మూలంగానే అంబేద్కర్ జయంతిని సెలవుగా ప్రకటించారన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదని స్పష్టం చేశాడు.

పొరుగు రాష్ట్రాల నేతల జయంతి ఉత్సవాలను కూడా యూపీలో నిర్వహించటం పరిపాటిగా మారింది. అందుకు కారణం వారి వర్గానికి చెందిన ప్రజలు ఇక్కడా ఉండటమే. బీఎస్పీ హయాంలో మొదలైన ఈ సాంప్రదాయం ఎస్పీలో తారా స్థాయికి చేరింది.కేవలం వాటి మీదే 44 సెలవులు ఉన్నాయి. ఇది అస్సలు మంచి పరిణామం కాదు. వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని చెప్పాడు.

ఇక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా 158 పని దినాలే ఉండటం గురించి ప్రస్తావిస్తూ త్వరలోనే వాటి సంగతి కూడా తేలుస్తామని ఆయన స్పష్టం చేశాడు. కేంద్రం పరిధిలో ఉన్న సెలవుల జోలికి కూడా వెళ్లి వాటిని రద్దు చేస్తే మాత్రం యోగి ఓ అరుదైన ఫీట్ సాధించిన సీఎంగా చరిత్రకెక్కటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Yogi Adithyanath  Public Holidays  

Other Articles