రిస్క్ లేకుండానే ఎమ్మెల్సీ కాబోతున్నాడోచ్ | Nara Lokesh Thanks to TDP Politburo for proposing his name as MLC.

Tdp politburo nominated nara lokesh name as mlc

TDP Nara Lokesh, TDP Politburo MLC Elections, TDP MLC Elections, Nara Lokesh MLC, MLC Nominations, MLC Nara Lokesh, Nara Lokesh Twitter, Chandrababu Naidu Son Nara Lokesh, Nara Lokesh Thanks

TDP Politburo nominated Nara Lokesh name as MLC in MLAs Quota. Later TDP General Secretary special thanks to Them.

లోకేష్ ఎమ్మెల్సీ.. అనుకున్నదే జరిగింది

Posted: 02/27/2017 12:16 PM IST
Tdp politburo nominated nara lokesh name as mlc

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఎమ్మెల్సీగా చేసేందుకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థలు లేదా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పాల్గొనకుండా, ఎమ్మెల్యేల కోటాలో లోకేశ్ ను ఎమ్మెల్సీగా పంపాలని టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ఈ మేరకు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్వయంగా నారా లోకేష్ తన ట్విట్టర్ లో కృతజ్నతలు తెలియజేశాడు.

‘‘నాపై నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు నా పేరును ప్రతిపాదించినందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు థాంక్స్ అని తెలియజేశాడు. ప్రజలకు సేవ చేసేందుకు సులువైన మార్గం దొరికిందంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.  ఇది కూడా చదవండి.. చినబాబు సిత్రాలు

 

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఐదు స్థానాలు ఖాయంగా లభించనున్నాయి. దీంతో లోకేశ్ ను ఈ కోటాలోనే ఎమ్మెల్సీని చేయాలని పార్టీ నేతలు ప్రస్తావించడంతో, చంద్రబాబు కూడా అందుకు అంగీకరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ ప్రతిపాదన చేయగా, మిగతా పాలిట్ బ్యూరో సభ్యులంతా ముక్తకంఠంతో మద్దతిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో లోకేష్ మంత్రి వర్గ పగ్గాలకు మార్గం సుగమమైందనే చెప్పుకోవచ్చు.  కాగా, ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగా, అభ్యర్థుల నామినేషన్లకు 28వ తేది తుది గడువు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP Politburo  Nara Lokesh  MLC Elections  

Other Articles