రేప్ ఎలా చేస్తాడో డీటెయిల్డ్ గా చెప్పాడంట.. సెహ్వాగ్ ఆ అమ్మాయికి ఎలా పంచ్ ఇచ్చాడో చూడండి | Virender Sehwag replies to Kargil martyr's daughter.

Gurmehar kaur anti post viral

Kargil Martyr's Daughter, Gurmehar Kaur, Gurmehar Kaur ABVP, Virender Sehwag Gurmehar Kaur, Gurmehar Kaur Funny Posts, Gurmehar Kaur Social Media, Gurmehar Kaur Rape Post, Gurmehar Kaur Internet, Gurmehar Kaur Randeep Hooda, Randeep Hooda Virendra Sehwag, Sri Ram College Gurmehar Kaur, Gurmehar Kaur Kargil Post

Kargil Martyr's Daughter Gurmehar Kaur, Who Called Out ABVP After Ramjas Clashes, Gets Rape ThreatsVirender Sehwag takes to bat after Ramjas violence sparked anti-ABVP social media campaign. Virender Sehwag's reply to Kargil martyr's daughter has taken the Internet by storm.

ఫేస్ బుక్ లో యువతి రేప్ పోస్ట్ వైరల్

Posted: 02/27/2017 11:42 AM IST
Gurmehar kaur anti post viral

ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి, ఆపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) యే అందుకు కారణమంటూ ఓ యువతి పెట్టిన పోస్ట్ ఇప్పుడు రచ్చ రచ్చగా మారుతోంది. ఫిబ్రవరి 22న రాంజాస్ కాలేజీలో చెలరేగిన హింసకు ఏబీవీపీ కారణమంటూ సదరు యువతి ఓ పోస్ట్ చేసింది. అప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని 20 ఏళ్ల గరుమెహర్ కౌర్ చెబుతోంది.

ఈ యువతి 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కుమార్తె. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఏబీవీపీ తన పోస్ట్ పై తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తోంది. రాహుల్ అనే వ్యక్తి అయితే తనను ఎంత క్రూరంగా రేప్ చేస్తాడో వివరంగా చెబుతూ ఓ సందేశం ఉంచాడు. దాన్ని చూసిన తనకు ఎంతో భయం వేసిందని అన్నారు. తనను జాతి వ్యతిరేకిగా చూస్తూ, ఎంతో మంది తిడుతున్నారని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను గురుమెహర్ అని మాత్రమే పిలవండి.. దయచేసి అమరవీరుడు కూతురిగా చూడకండి అంటూ కోరింది కూడా.

Gurumehar ABVP Post

రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను రాంజాస్ కాలేజీలో ఓ సెమినార్ కు ఆహ్వానించడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించగా, దానిపై స్పందించిన గుర్ మోహన్, తన ఫేస్ బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తూ, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినని, ఏబీవీపీకి భయపడనని, తాను ఒంటరిదాన్ని కాదని, ఇండియాలోని ప్రతి విద్యార్థీ తన వెంటనే ఉన్నాడని రాసిన ప్లకార్డును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు మద్దతిస్తూ ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు.


సెహ్వాగ్ కు ఏం సంబంధం?


శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన ఈ గుర్‌మెహర్ గతంలో ఓ పోస్ట్ ఉంచింది. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఆ పోస్టుకు సెహ్వాగ్ తన దైన ఫన్నీ స్టైల్ లో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ  ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Virender Sehwag Gurumehar

 

మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నెటిజెన్ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపింది. 15 వేల మంది సాధారణ పౌరులను, 6,726 మంది సైనికులు చంపిన పాక్ పై సానుకూల పోస్ట్ పెట్టిన గురుమెహర్ కు ఇతరులను విమర్శించే హక్కు లేదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇక ఆ ఫోటోతో ట్రోల్స్ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gurmehar Kaur  Facebook  ABVP  Virendra Sehwag  

Other Articles