ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా.. ఎందుకు? | Mithun Chakraborty resigns from Rajya Sabha.

Actor mithun chakraborty quits rajya sabha

Mithun Chakraborty, Mithun Chakraborty Resign, Mithun Chakraborty MP, Rajya Sabha Mithun Chakraborty, TMC Mithun Chakraborty, Mithun Chakraborty political carrier, Mithun Chakraborty resign, Actor Mithun Chakraborty

Mithun Chakraborty resigns from Rajya Sabha citing health reasons.

ఎంపీ పదవికి నటుడు రాజీనామా

Posted: 12/26/2016 04:44 PM IST
Actor mithun chakraborty quits rajya sabha

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. కొన్ని రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత తరపున ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 2014లో మమతా బెనర్జీ ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేసింది. 2020లో ఆయన పదవీకాలం ముగియనుంది.

66 ఏళ్ల మిథున్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు పార్టీ ప్రతినిధి డెరిక్ ఓ బ్రెయిన్ ఓ ప్రకటనలో తెలిపాడు. మిథున్ తో తమ సత్సబంధాలు కొనసాగుతాయని, ఆయన త్వరగా కోరుకోవాలని టీఎంసీ కోరుకుంటున్నట్లు అందులో తెలిపాడు. బెంగాల్ లో కలకలం రేపిన శారద స్కాంలో మిథున్ కి ఈడీ నోటీసులు కూడా పంపటం తెలిసిందే. 

కాగా, 1976లో మృణాల్ సేన్ మృగయ చిత్రంతో మిథున్ సినిమా డెబ్యూ జరిగింది. తొలి సినిమాతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. డాన్స్ డాన్స్, ప్యార్ జుక్త నహీ, అగ్నిఫథ్ లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తెలుగులో ఆది పినిశెట్టి మలుపు, ‘గోపాల గోపాల’ సినిమాలో ఆయన నటించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TMC MP  Actor Mithun Chakraborty  Resign  

Other Articles