తమిళనాట నల్లధన నోట్ల కట్ల పాముల విషం(షయం) మొత్తంగా బయటకు వస్తోంది. ఇంత పెద్ద కుంభకోణం అసలు ఎలా వెలుగు చూసిందన్న దానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే సరిగ్గా అమ్మ చనిపోయిన రోజే ఈ అవినీతి తేనెతుట్టేను అధికారులు కదిలించినట్లు ఇప్పుడు తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్నవారిపై నిఘా పెట్టిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈ క్రమంలోనే శేఖర్‌రెడ్డి టెలిఫోన్ సంభాషణలను ట్రాప్ చేయడంతో నోట్ల కుట్ర బయటపడింది.
ఆరోజున రామ్మోహన్రావు, చెన్నై కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి మధ్య కొత్త నోట్లు భద్రపరచడంపై టెలిఫోన్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటికే కొన్ని కోట్లను మార్చేసుకున్న వాళ్లు అ డబ్బంతా ఎలా భద్రపరుచుకోవాలన్న దానిపై అందులో చర్చించారంట. అదంతా అధికారులు రికార్డు చేశారు కూడా. వెంటనే అప్రమత్తం అయ్యి ముందుగా మెరుపువేగంతో శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు, ఆపై అతడిచ్చిన సమాచారంతో సీఎస్ రామ్మోహన్రావు, అతడి కుటుంబ సభ్యుల ఇళ్లపైనా దాడులు చేశారు.
సుమారు రెండు వారాల క్రితమే ఐటీ అధికారులు దాడులకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యమైంది. ఈ జాప్యం వల్ల రామ్మోహన్‌రావుకు విషయం లీకయింది. దీంతో ఆయన జాగ్రత్త పడ్డట్లు సమాచారం. రెండు వారాల క్రితమే దాడులు జరిపి ఉంటే రామ్మోహన్రావు, బంధువుల ఇళ్ల నుంచి భారీగా ఆస్తులు, నగదు పట్టుబడి ఉండేవని అంటున్నారు. ఈ విషయాలను ఓ అధికారి తెలిపారంటూ పేర్కొంటూ ఓ తమిళ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది.
ఎంత దొరికిందంటే...
మరోవైపు రామ్మోహనరావు, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలు గురువారం ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో మొత్తం 15 కేజీల బంగారం, రూ.24 లక్షల నగదు, కీలక సమాచారం ఉన్న ల్యాప్‌టాప్, 3 హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహనరావు కార్యాలయం నుంచి 40 ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం తనిఖీల్లో రూ.100 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రామ్మోహన్రావు కుమారుడు వివేక్ నివాసం, కార్యాలయం, ఆయన న్యాయవాది ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులతోపాటు ఏపీకి చెందిన కొందరు బడా బాబులతో శేఖర్‌రెడ్డి, రావులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని ఆయన అన్నారు. దాడుల్లో పట్టుబడిన సొమ్ములో ఈ ఆరుగురు మంత్రులకు వాటా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు. కొందరు పారిశ్రామికవేత్తలు సైతం వీరి మనుషులుగా తేలిందన్నారు. ఇప్పటికే రామ్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అతన్ని వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపింది ప్రభుత్వం. ఏక్షణంలోనైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more