కేజ్రీవాల్ నిజంగానే బాధపడుతున్నాడా? | Jung resignation really surprise to Kejriwal.

Kejriwal calls jung resign as surprise

Arvind Kejriwal, Najeeb Jung, Arvind Kejriwal meets Najeeb Jung, personal reasons Arvind Kejriwal, Arvind Kejriwal surprise, Kejriwal calls Jung resign, Ajay Maken Najeeb jung, Congress Najeeb Jung, Kejriwal tweet Jung

Arvind Kejriwal meets Najeeb Jung, says resignation due to 'personal reasons.

రాజీనామాపై కేజ్రీవాల్ అలా రియాక్ట్ అయ్యాడు

Posted: 12/23/2016 11:04 AM IST
Kejriwal calls jung resign as surprise

హస్తిన రాజకీయాలను వేడెక్కిస్తూ తన లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నిన్న నజీబ్ జంగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కారణాలేవైనా జంగ్ తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా షాక్ కి గురయ్యాడు. దీంతో ఈ ఉదయం రాజ్ నివాస్ లోని వెళ్లిన కేజ్రీ, నజీబ్ ను కలిసి వచ్చాడు. తాను మర్యాద పూర్వకంగానే నజీబ్ జంగ్ ను కలిశానని, ఇందులో మరే ఉద్దేశాలూ లేవని అనంతరం మీడియాతో స్పష్టం చేశాడు.

కేవలం వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారని అన్నాడు. తనకెంతో ప్రియమైన విద్యా బోధన రంగంలోకి వెళ్లనున్నట్టు జంగ్ వివరించాడని, నజీబ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాను కోరుకున్నానని వెల్లడించాడు. ఇక నజీబ్ జంగ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాడు. తాను ఉపరాష్ట్రపతి పదవీ రేసులో ఉన్నానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశాడు. పుస్తకాలు చదువుకోవడం, విద్యాపరమైన విషయాలపైనే తన దృష్టి కేంద్రీకరిస్తానని, అందుకే, తాను రాజీనామా చేశానని చెప్పారు. ఈ విషయమై తనపై ఎవ్వరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాజీనామాకు సీఎంతో గొడవలే కారణమా? అన్న ప్రశ్నకు... కేజ్రీవాల్ తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూ... గతంలో తనపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించేందుకు విముఖత వ్యక్తం చేశాడు.

 

కాంగ్రెస్ రెస్పాన్స్...
ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ తనదైన వాదన వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, దీంతో, నజీబ్ జంగ్ పై ఒత్తిడి పెరిగిందని ఆరోపించారు. అందుకే, నజీబ్ జంగ్ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ మాకెన్ అంటున్నాడు. ఆయన రాజీనామా వెనకున్న అసలు కారణాన్ని తెలపాలని, ఎల్జీ పదవి నుంచి ఆయన్ను ఎందుకు తొలగించారో మోదీ తెలియజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది కూడా. ఏది ఏమైనా పదవి కాలం కంటే ముందుగానే గద్దె దిగిపోయిన జంగ్ వ్యవహారంలో రాజకీయ కోణం వెతుకుతూ ఇలా విమర్శలకు దిగటం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఎల్జీగా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi CM Aravind Kejriwal  Najeeb Jung resignation  surprise  

Other Articles