ఖాతాలో డబ్బు ఫుల్.. పేటీఎం వ్యాలెట్‌లో నిల్‌? ఏం జరుగుతోంది... | Paytm still facing glitches.

Transaction issues on paytm continue

Paytm, Paytm service, Paytm customer care, Paytm unavailable, Paytm problem, Paytm stop, Paytm issue, Paytm payment issues, Paytm banking, Paytm wallet, Paytm Transaction issues, Demonetization Paytm

Paytm still facing glitches. users complain of payment issues Business.

పేటీఎం సర్వీసులు ఎందుకు ఆగిపోయాయంటే...

Posted: 12/23/2016 10:04 AM IST
Transaction issues on paytm continue

క్యాష్ లెస్, డిజిట‌ల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ చేస్తున్న యత్నాలకు మంచి స్పందనే లభిస్తోంది. అంతేకాదు సర్వీస్ చార్జీలను ఎత్తేటయం, మనీ రిటర్న్స్ స్కీం తదితరాలతో మొబైల్ వ్యాలెట్ల‌కు విప‌రీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ లు‌ గురించే చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే డిజిట‌ల్ లావాదేవీల‌పై విషయంలో ప్రజలకు కొన్ని చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత విపరీతమైన లాబాలు ఆర్జించిన పేటీఎం వినియోగదారులకు ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ‌య్యాయి. త‌మ బ్యాంకు ఖాతాల నుంచి డ‌బ్బులు డెబిట్ అవుతున్నా పేటీఎం వ్యాలెట్‌లోకి మాత్రం చేర‌డం లేదంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. అంతేకాదు పేటీఎం సరిగ్గా పని చేయటం లేదని, త‌మ ఖాతాలో డ‌బ్బులు ఎంతున్నాయో చూసేందుకు, లావాదేవీలు జరిపేందుకు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

పోనీ వ్యాలెట్‌లోని సొమ్మును తిరిగి త‌మ బ్యాంకు ఖాతాలోకి మ‌ళ్లించుకుందామంటే దానికి కూడా అవకాశం లేకపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. యాపిల్‌ హ్యాండ్‌సెట్లను ఉపయోగించే పలువురు యూజర్లయితే.. తమ పేటీఎం వ్యాలెట్‌ ఖాతాలను తెరిచి దానిద్వారా ఏదైనా చెల్లింపులు, ఇరరత్రా లావాదేవీలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మరో పక్క ఈ విష‌యాన్ని క‌స్ట‌మ‌ర్ కేర్ దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు.

అంతరాయంకు చింతిస్తున్నాం...
సర్వర్‌కు సరిగ్గా అనుసంధానం కాకపోవడం, ఇతరత్రా సాంకేతికపరమైన అంశాల మూలంగానే పేటీఎం సేవల్లో అంతరాయం కలిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. యూజ‌ర్ల ఫిర్యాదుల‌పై పేటీఎం అధికార ప్ర‌తినిధి మాట్లాడుతూ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయిన సొమ్ము ఏ కార‌ణంగానైనా వ్యాలెట్‌లో జ‌మ‌కాక‌పోతే 48 గంట‌ల త‌ర్వాత ఆటోమెటిక్‌గా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని వివ‌రించారు. బ్యాంక్‌ సర్వర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుండటం వల్లే ఇలాంటి సమస్యలు అధికం అవుతున్నాయని, ఇప్పటికే తమ సాంకేతిక నిపుణులు పరిష్కరించే పనిలో పడ్డారని ఆయన వివరణ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Transaction issues  Paytm Payments  Problem  

Other Articles