బంగ్గీ జంప్ అతని ప్రాణాలు ఎలా తీసిందో చూడండి | Man bungee jumps kills himself.

Brazil man bungee jumps leads to death

Brazil man bungee jump, Fabio Ezequiel de Moraes, bungee jump kills, bungee jump death, bungee jump fail, bungee jump rope too long, bungee jump death, bungee jump video, bungee jump tragedy,

Rope was too long Brazil man bungee jumps became tragedy.

ITEMVIDEOS: తాడు ఉన్నా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి

Posted: 12/21/2016 06:16 PM IST
Brazil man bungee jumps leads to death

కలం కలిసి రాకపోతే పామే తాడై కాటేస్తుందన్నది ఓ సామెత. అది ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో నిజంగానే రుజువైంది. సాహసం కొద్దీ అతను చేయబోయిన ప్రదర్శన అతని ప్రాణాలనే బలి తీసుకుంది. బ్రెజిల్ లో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్లితే...

36 ఏళ్ల ఫేబియో ఎజిక్యుయెల్ డి మోరాయిస్ అనే వ్యక్తి 40 మీటర్ల ఎత్తున్న ఓ బ్రిడ్జి మీది నుంచి బంగ్గీ జంప్(తాళ్లు కట్టుకుని దూకటం) చేయటానికి ప్రయత్నించాడు. అతని ఆరేళ్ల కొడుకు, భార్య ఆ సాహాసాన్ని చూసేందుకు సిద్ధమయ్యారు. తాళ్లు గీళ్లు అంతా కట్టుకుని బందోబస్తుతోనే దూకాడు. కానీ, అక్కడే సీన్ రివర్స్ అయ్యింది.

 

అతను కట్టుకున్న తాడు పొడవు ఎక్కువ ఉండటంతో నేరుగా అతను వెళ్లి భూమిని ఢీకొట్టాడు. అంతే క్షణాల్లో అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తీవ్ర రక్త స్రావంలో పడి ఉన్న అతన్ని అయినప్పటికీ ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

నిజానికి మోరాయిస్ తన ఆరేళ్ల కొడుకుతో కలిసి ఈ సాహసం చేయాలని ప్రయత్నించాడంట. చివరి నిమిషంలో భార్య బలవంతం మేరకు పిల్లాడిని తప్పించి, ఒక్కడే ఈ జంప్ కి సిద్ధమయ్యాడు. మొత్తానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని వాడిన తాడే అతని ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. గతంలో సౌత్ కొరియాలో ఓ మహిళ ఇలాగే బగ్గీ జంప్ చేయగా, తాడు మధ్యలో తెగిపోవటంతో 140 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil Man Death Video  bungee jump fail  Rope was too long  

Other Articles