సీఎం భార్యతో బిగ్ బీ రొమాన్స్ | Amruta Fadnavis romantic steps with Amithabh Bachchan.

Maharashtra cm wife in glamour field

Maharashtra CM Wife, Amruta Fadnavis, Amruta Fadnavis and Amitabh Bachchan, Big B Amruta Fadnavis, Amruta and Amithabh romance, Amrutha Fadnavis hot, Amruta Fadnavis red dress, Amruta Fadnavis video album, Amruta Fadnavis romantic steps, Mrs Fadnavis video album, Ahmed Khan Big B Amrutha, Amrutha with bachchan

Amruta Fadnavis and Amitabh Bachchan shoot for music video.

పొట్టి బట్టలో చిందులేసిన సీఎం భార్య

Posted: 11/30/2016 12:04 PM IST
Maharashtra cm wife in glamour field

అది సౌత్ ముంబై లోని ఓపెరా హౌస్. మంగళవారం ఉదయం 9 గంటలు అవుతోంది. అహ్మద్ ఖాన్ అతని టీం ఓ మ్యూజిక్ వీడియో తీసేందుకు సిద్ధమైపోతున్నారు. ఏర్పాట్లు కొనసాగుతుండగానే అంతలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్. ఏదో షూటింగ్ జరుగుతుందని బయట గుమిగూడిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్. అందులోంచి తేరుకునేలోపు ప్యూజులు ఎగిరిపోయేలా మరోకటి తగిలింది. ఓ లేడీ రెడ్ కలర్ మినీ స్కర్ట్ వేసుకుని కారులోంచి దిగింది. ఆవిడ ఎవరో కాదు... మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవీస్.

భర్త సీఎం అయినప్పటికీ బ్యాంక్ ఎంప్లాయి గానే కొనసాగుతున్న అమృతకి పాడటం అంటే పిచ్చి. ఇంతకు ముందు కునాల్ కోహ్లీ తీసిన ఫిర్ సే.. ప్రకాష్ ఝా మూవీ జై గంగాజల్ కోసం గాత్రదానం చేసిన అమృత.. ఇక ఇప్పుడు ఏకంగా యాక్టింగ్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. తొలిప్రయత్నంలోనే ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి డ్యాన్సులు వేసే అవకాశం కొట్టేసింది.

ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రాగా.. ఆ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపించనున్నారు. ఇద్దరి మధ్య సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుందంట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం షూటింగ్ చేయగా.. ఇందులో మిసెస్ ఫడ్నవీస్ గ్లామర్ రూపం చూపించడం విశేషం. మోకాళ్ల పైకి వేసిన రెడ్ కలర్ ఫ్రాక్.. హైహీల్స్ తో అమృతతో బిగ్ బీ స్టెప్పులేస్తున్నాడు. అహ్మద్ ఖాన్ డైరక్షన్ లో చిత్రీకరించిన ఈ పాట త్వరలోనే విడుదల కానుంది.

Big B Amrutha romance

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amruta Fadnavis  Amithabh Bachchan  music video  

Other Articles