పిల్లి కళ్ల చాయ్ వాలా.. పాట మాత్రం కేక | 'Chai wala' Arshad Khan's music video out.

Pakistan s chaiwala music video debut

Pakistani ‘chaiwala’ Arshad Khan, Arshad Khan song, chaiwala album, Pakistani ‘chaiwala’, chaiwala rap song, Model Arshad Khan, Arshad Khan rap song

Viral Pakistani ‘chaiwala’ Arshad Khan debuts in rap song.

ITEMVIDEOS:ఆ చాయ్ వాలా పాటతో కూడా పిచ్చెక్కిస్తున్నాడు

Posted: 11/30/2016 01:02 PM IST
Pakistan s chaiwala music video debut

అర్షద్ ఖాన్ గుర్తున్నాడా? సరిహద్దులో కొన్నాళ్ల క్రితం యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఓ ఛాయ్ వాలా పేరు వార్తల్లో సంచలనంగా మారిన విషయం గుర్తుందా? అతనే ఇతగాడు. ఇత్వార్‌ బజార్‌లో ఛాయ్ అమ్ముకుంటూ జీవనం కొనసాగిన ఈ పిల్లి కళ్ల యువకుడి ఫోటోలు వైరల్ కావటం, ఆపై కొన్ని బ్రాండ్ కంపెనీలు అతన్ని తమ మోడల్ గా, టీవీ ఛానెళ్లయితే అతనితో ప్రోగ్రాంలు చేయటం చూశాం.

ఇక ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ యువకుడు ఏకంగా ఓ ఆల్బంతోనే మన ముందుకు వచ్చాడు. పాకిస్థాన్ కు చెందిన రాపర్స్ సిద్ మరియు డానీలు ఈ పాటను ఆలపించి నటించారు. ఇందులో అర్షద్ పాపులర్ అయ్యాడో చూపిస్తూ పాట మొత్తం సాగుతుంది. అమ్మాయిలు రావటం వీరిద్దరినీ వదిలేసి అర్షద్ వెంట పడటం, క్యాచీ లిరిక్స్ ఇలా కొనసాగే ఛాయ్ వాలా ఆల్బం 2.30 నిమిషాలతో అంతా సూపర్బ్ గా ఉంది. ఇప్పటికే లక్షకుపైగా వ్యూవ్స్ రాగా, అర్షద్ అఫీషియల్ పేజీలో కూడా సుమారు అంతే వ్యూవ్స్ తో దూసుకుపోతుంది.

 

ఈ చాయ్ వాలా పాకిస్తాన్ అణ్వాయుధమనీ, భారత్‌ చేసి సర్జికల్‌ దాడులకు ప్రతీకారంగా భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడంటూ అప్పట్లో మోదీని టార్గెట్ చేస్తూ #ChaiWala పేరుతో యాష్ టాగ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఆ ఆల్బంకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో కత్రినా లాంటి బాలీవుడ్ హీరోయన్ల పేరు కూడా వాడటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  chaiwala  Arshad Khan  rap song  

Other Articles