రాదు.. రాదు అంటూనే.. మిచెల్లీపై ఒబామా ప్రశంసలు President Obama Says Michelle Will Never Run for Office

President obama says michelle will never run for office

michelle obama, obama, obama rolling stones, michelle obama for president, michelle obama White House, michelle 2020, michelle obama 2020, michelle obama candidacy, obama rolling stones interview, world news

Outgoing US President Barack Obama has said that his wife and the current First Lady Michelle Obama will never run for the White House

రాదు.. రాదు అంటూనే.. మిచెల్లీపై ఒబామా ప్రశంసలు

Posted: 11/30/2016 11:31 AM IST
President obama says michelle will never run for office

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన భార్య మిచెల్లీ ఒబామా రాజకీయ భవితవ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా మరోమారు క్లారిటీ ఇచ్చేశారు. 2020లో​జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుత అమెరికా ప్రధమ పౌరురాలు మిచెల్లీ బరిలో ఎట్టి పరిస్థితులలో నిలువరని ఆయన స్పష్టం చేశారు. ఇది వరకు ఈ విషయాన్ని చెప్పినా.. ఆ తరువాత అమె అమెరికా వాసులతో త్వరగా మమేకమైయ్యారని, త్వరలో బరిలో నిలుస్తారని ఒబామా సరదాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని తాజాగా రోలింగ్ షటర్స్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.  

అయితే ఇటీవల ముగిసిన తాజా అమెరికా ఎన్నికలలో మిచెల్లీ డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. దీంతో అమె నాలుగేళ్ల తరువాత రానున్న అగ్రరాజ్య ఎన్నికలలో బరిలో నిలుస్తారని, పలు రకాల వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చే మాదిరిగా.. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలిస్తే మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారని కూడా వార్త కథనాలు వచ్చాయి.

ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో హిల్లరీ క్లింటన్ పరాజయం పాలవ్వడంతో ఆ ఆశలపై నీల్లు పడ్డాయి. కాగా, వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ ఒబామా పోటీచేస్తారని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒబామా దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిచెల్లీ ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని మరోమారు స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు మీటను నోక్కారు.

మిచెల్లీ రాదు.. రాదు అంటూనే వస్తుందన్న సంకేతాలను ఆయన పరోక్షంగా ఇస్తున్నారా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అగ్రరాజ్య రాజకీయ విశ్లేషకులు. కుండబద్దలు కోట్టినట్లు అయన చెప్పినా.. నాలుగేళ్ళ తరువాత అమెరికాలో వుండే రాజకీయ పరిస్తితులను బట్టి.. రాజకీయంగా బరిలోకి దిగక తప్పని పరిస్థితులు వచ్చాయన్న అమె క్లారిటీ ఇవ్వచ్చునని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకోసమే ఒరాక్ ఒబామా మిచెల్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె చాలా ప్రతిభావంతురాలని, అమెరికా ప్రజలతో మమేకమయ్యారని ఒబామా ప్రశంసించడం కూడా అమె రాజకీయాల్లోకి వస్తారనేందుకు సంకేతాలుగా వారు పేర్కోంటున్నారు. ఇప్పటి వరకు ఒబామా మాత్రమే మిచెల్లీ రాజకీయాల్లోకి రాదని చెబుతూ వస్తున్నారని.. కానీ అయన సతీమణి మిచెల్లీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. ఇదే అమె రాజకీయ అరంగ్రేటానికి సంకేతమని కూడా రాజకీయ విశ్లేషకులు భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michelle obama  barrack obama  rolling stones  presidential elections  white house  

Other Articles