ఐఆర్ సీటీసీ లో రిజర్వేషన్ కి సర్వీస్ టాక్స్ లేదు | No service tax on train tickets booked through IRCTC

No service tax on train tickets booked through irctc

IRCTC, Online ticket booking, No service tax, train tickets, train tickets, IRCTC Online, IRCTC offer, IRCTC Demonstration, no surcharge,

Demonstration Effect: Service tax waived for online train ticket booking till Dec 31.

ఆన్ లైన్ రైల్వే బుకింగ్ కి నో టాక్స్

Posted: 11/23/2016 08:56 AM IST
No service tax on train tickets booked through irctc

ఇక నుంచి కొన్ని రోజుల పాటు ఆన్ లైన్ లో టికెట్లు చౌకగా మారనున్నాయి. మాములుగా టికెట్లను ఇలా బుక్ చేసుకున్నప్పుడు సర్ ఛార్జీ కింద బాదటం మనకు తెలిసిందే. కానీ, ఇక నుంచి సర్ ఛార్జీలు వసూలు చేయకూడదని ఇండియన్ రైల్వే శాఖ డిసైడ్ అయిపోయింది.

పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్రమైన చిల్లర కొరత ఏర్పడిన వేళ, నగదు రహిత ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ జరిపే అన్ని కొనుగోళ్లపైనా సర్వీస్ ట్యాక్స్ ను ఎత్తి వేస్తున్నట్టు ప్రకటించింది. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే సేవా రుసుము చెల్లించనక్కర్లేదని వెల్లడించింది.

బస్సు, రైలు టికెట్లకు చిన్న నోట్లు లేక ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నందున, ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆశ్రయిస్తే, సమస్య పరిష్కృతమవుతుందని ఐఆర్సీటీసీ పేర్కొంది. గతంలో ఏసీ క్లాస్ టికెట్లకు 40 రూపాయలు, నాన్ స్లీపర్ టికెట్లకు 20 రూపాయలు రైల్వే శాఖ వసూలు చేసేది. రైల్వే శాఖకు ఏడాదికి 1500 కోట్ల ఆదాయం వస్తే అందులో 33 శాతం అంటే సుమారు 540 కోట్లు సర్వీస్ ఛార్జీల ద్వారానే వసూలు కావటం విశేషం. రోజుకు రమారమీ 12 లక్షల మంది పాసింజర్లు ఆన్ లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటుడగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  Online ticket booking  No Service tax  

Other Articles