ఎఫ్ బీ వీడియోతో బుక్ అయిన షేన్ వార్న్ | Shane Warne and Kevin Pietersen fined for video seatbelt blunder.

Shane warne facebook video earns cricketers seatbelt fines

Shane Warne and Kevin Pietersen, Shane Warne, Kevin Pietersen, seatbelt blunder, Shane Warne facebook, Shane Warne fined, Shane Warne video, Shane Warne FB video, Tasmania Police Cricketers

Shane Warne and Kevin Pietersen fined for not wearing seatbelts.

సీటు బెల్ట్ తో స్టార్ క్రికెటర్లకు ఫైన్

Posted: 11/23/2016 09:26 AM IST
Shane warne facebook video earns cricketers seatbelt fines

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అతితో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఓ వీడియోతో అడ్డంగా బుక్ అయ్యాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో డాషింగ్ బ్యాట్స్ మెన్లు కెవిన్ పీటర్ సన్, మైకేల్ స్లేటర్ లతో కారులో ప్రయాణిస్తున్న ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు. అంతే దెబ్బకి వాళ్లందరు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.

ప్రస్తుతం సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఈ టెస్ట్ పండితులు వ్యాఖ్యాతలుగా వ్యవహారిస్తున్నారు. మూడో రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మార్క్ టేలర్ కారులో మాజీ కీపర్ ఇయాన్ హేలీ తో కలిసి వీరంతా రైడ్ కి వెళ్లారు. ప్రయాణం అంతా సవ్యంగానే సాగింది. దీంతో రైడ్ వివరాలు వెల్లడిస్తూ షేన్ వార్న్ ఓ వీడియోను పోస్టు చేశాడు.

 

Shane Warne Peterson fined

అయితే నాలుగు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మార్క్ టేలర్ కారును డ్రైవ్ చేయగా, ఇయాన్ హేలీ అతని పక్కన కూర్చున్నాడు. వీరిద్దరూ సీట్ బెల్టులు ధరించారు. వెనుక సీటులో షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ స్లేటర్ కూర్చున్నారు. ఈ ముగ్గురూ సీట్ బెల్టులు పెట్టుకోలేదు. దీంతో ఈ వీడియోను చూసిన టాస్మేనియన్ పోలీసులు సీట్ బెల్టులు ధరించని ఆ ముగ్గురుకీ 300 డాలర్లు( 20,500 రూపాయల) జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Warne  Facebook Video  No Seat Belt  

Other Articles