పవన్ అనంత సభ టార్గెట్ చాలా.. చాలా... పెద్దదే | Janasena ananthapuram sabha details

Janasena ananthapuram sabha details

Pawan Kalyan JD Laxmi Narayana, Janasena Jagan, Pawan Jagan, Pawan next target Jagan, After BJP, TDP now YSRCP, Janasena Pawan Kalyan, Pawan kalyan 2016, Pawan politics 2016, Pawan kalyan political review, Seemandhra Hakkula chaitanya sabha

Janasena chief pawan kalyan target jagan at Anantha Sabha.

పవన్ అనంత సభ బోలెడన్ని విషయాలు

Posted: 11/05/2016 11:10 AM IST
Janasena ananthapuram sabha details

రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణ విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే రెండు సభల ద్వారా తన పొలిటికల్ ప్రస్థానం వేగం పెంచుతున్నానని అల్రెడీ చెప్పేసిన జనసేన చీఫ్ ఇప్పుడు ఏపీలో పూర్తి స్థాయి పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ముఖ్యంగా అధికార పక్షాల కంచుకోటలైన పశ్చిమగోదావరి, అనంతపురంలను టార్గెట్ చేయటమే దీనిని ధ్రువపరుస్తోంది.

ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జగన్ విచక్షణ కన్నా ఎంతో పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. స్పెషల్ స్టేటస్ అంశం అటకెక్కినప్పటికీ, అనంతపురం జిల్లాను కరువు కోరల నుంచి రక్షించగలిగే ఏకైక మంత్రం అదేనని ప్రజలకు బలంగా వినిపించేందుకు సిద్ధం అయ్యాడు. అంతేకాదు సీమ ప్రజలు వారు ఏం కోల్పోతున్నారో వివరించేందుకే సభకు "సీమాంధ్ర హక్కుల చైతన్య సభ " అని నామకరణం చేశారని జనసేన చెబుతోంది. నవంబర్ 10న సాయంత్రం నాలుగు గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరగనున్న ఈ సభ కోసం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక సభ అనంతరం గుత్తిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ ముఖాముఖి కానున్నాడంట. ఇందులో సామాజిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు భోగట్టా. అయితే కేవలం తమ ప్రాంతంలో నెలకొన్న కరువు గురించి వివరించటంతోనే పవన్ కళాశాలకు వస్తున్నాడని, ఇందులో ఏం రాజకీయం లేదని సదరు కాలేజీ ప్రిన్స్ పాల్ వివరిస్తున్నాడు.

గత రెండు సభల్లో టీడీపీ, బీజేపీలను టార్గెట్ చేసిన పవన్, ఈసారి వైసీపీ అధినేత జగన్ వైపు విమర్శలు ఎక్కుపెట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం జగన్ కేసును డీల్ ఓ సిన్సియర్ ఆఫీసర్ ను జనసేనలో చేర్చుకోవాలని, తద్వారా ప్రతిపక్ష నేతపై తన స్టాండర్ట్ ను తీసుకెళ్లటం ఈజీ అవుతుందనే భావనలో ఉన్నాడంట. అప్పట్లోనే ఆయనతో చర్చలు జరిపిన పవన్ మరోసారి కీలక నేతలను పంపి మరో దఫా చర్చలు జరిపించినట్లు, ఈ మేరకు అనంతసభ సమయంలోనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇక ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో సంబంధాలకు పూర్తిస్థాయిలో తెరపడిందని తేల్చేసిన జనసేన, మరోసారి అదే విషయాన్ని స్పష్టం తేటతెల్లం చేసింది. బీజేపీ పార్టీ ఏపీ ఇన్ చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని విశ్లేషకుల మాట. ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా సిద్దార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ ఎన్డీఏలో లేరని, ఆయన కేవలం గత ఎన్నికల్లో తమకు మద్దతు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని బీజేపీని విమర్శిస్తున్నారని విభజనలో తెదేపాతో సహా అన్ని పార్టీల పాత్ర ఉండగా పవన్ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు.

మొత్తం మీద అధికార పక్షాలతోపాటు, ప్రతిపక్షాన్ని కూడా ఇరుకున పెట్టే రీతిలో అనంత సభను వేదికగా చేసుకోవాలని పవన్ పెద్ద ఫ్లాన్ తోనే ఉన్నాడు. అయితే గత సభల్లో పన్నెత్తి మాట్లాడని కాపు రిజర్వేషన్ల వ్యవహారంపై పవన్ ఈసారైనా స్పందిస్తాడో చూడాలి. ముద్రగడ పాదయాత్ర, దానికి అధికార పక్షం కౌంటర్ సమాధానం, ఇందులో జగన్ కూడా ఇన్ వాల్వ్ అవుతుండటంతో ఇప్పుడు అది ఖచ్ఛితంగా హాట్ టాపిక్ కాబోతుంది. మరి ఈ సభలో అయినా లేవనెత్తుతాడా? ఎత్తితే ఏం మాట్లాడుతాడు? లేక మళ్లీ దాటవేతే ఉంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Ananthapuram Sabha  Seemandhra Hakkula Chaitanya Sabha  

Other Articles