ఉపాధ్యయుడిపై కాల్పులు జరిపిన పదో తరగతి విద్యార్థి 10 class student shoots teacher in madhya pradesh

10 class student shoots teacher in madhya pradesh

Teacher shot by a class 10th student, Ratlam student shoots teacher, teacher shot by student, ratlam, Madhya Pradesh, teacher rushed to hospital. teacher student, crime

Teacher shot by a class 10th student in Ratlam area of Madhya Pradesh, admitted to hospital. Investigation underway

మధ్యప్రదేశ్ లో కలకలం.. ఉపాధ్యాయుడిపై విద్యార్థి కాల్పులు

Posted: 11/05/2016 12:24 PM IST
10 class student shoots teacher in madhya pradesh

అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుందని అగ్రరాజ్యాన్ని ప్రపంచ దేశాలు బాగానే అడిపోసుకుంటున్నాయి. ఇదే సమయంలో భారత దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తానని నాయకులు చెబుతున్న మాటలు మాత్రం వాస్తవ రూపం దాల్చడం లేదు. ఇప్పటికే దేశం పెరు చెప్పగానే విదేశీయులు.. నిత్యం అత్యాచారలు జరుగుతుంది మీ దేశంలోనే కదా..? అని అవమానిస్తున్నారని స్వయంగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఇటీవలే అవేదనను వ్యక్తం చేశారు. మహిళలను ఆరాధించే దేశంలో.. దేశ సంస్కృతికి భిన్నింగా వారిపై అత్యాచారాలకు తెగబుడుతున్నారా.. అన్న మాటాలతో ఆయన హృదయం తల్లడిల్లిందని చెప్పారు.

అదే సమయంలో నేర సంస్కృతి కూడా దేశంలో శృతిమించిపోతుంది. హర్యానాలో ఓ ఫ్లైఓవర పై నుంచి వస్తున్న ఓ వ్యక్తిని అటకాయింది, పలువురు వ్యక్తులు దారుణంగా కత్తులు, కర్రలతో దాడులు చేసిన ఘటనను మరువక ముందే గుజరాత్ లో తండ్రి కొడుకులు ఓ వ్యక్తిని రోడ్డుపైనే దారుణంగా నరికి చంపారు. వీటిని రేపటి తరం విద్యార్థులు గమనిస్తూన్నారని.. కొందరు అచరణలో కూడా పెడుతున్నారని ముజాఫర్ పూర్ లో కేంద్రీయ విద్యాలయం పాఠశాలలో జరిగిన ఘటన రుజువు చేసింది.

ఈ ఘటనను మర్చిపోక ముందే తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రత్లాం ప్రాంతంలోని పాఠశాలతో పదోతరగతి చదువుతున్న విద్యార్థి టీచర్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగగా వుందని వైద్యులు చెబుతున్నారు. అటు కాల్పులు జరిపిన విద్యార్థి పరారీలో వున్నాడని పోలీసులు చెబుతున్నారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో దేశంలో కూడా నేర సంస్కృతి విపరీతంగా పెరిగిపోతుందని స్పష్టమౌతుంది. మొక్కగా వున్నప్పుడే తుంచకుంటే మానయ్యాక తుంచలేరన్న విఫయాలను ప్రభుత్వాలు గ్రహించాలి. భవిష్యతు భారత్ దే అని చెబుతున్న నేతలు.. నేరాలను, నేర సంస్కృతిని అదుపు చేయకుండే అదే దేశానికి శాపంగా కూడా పరిణమించే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  class 10th student  shot  ratlam  Madhya Pradesh  crime  

Other Articles