భార్య శవాన్ని ముక్కలు చేసి చుక్కలు చూపాడు | man killed wife Scattered Body Parts in colony

Man killed wife scattered body parts in colony

Man Killed His Wife, Alwar man killed wife, man Scattered Body Parts All Around, dismembered parts in colony, woman killed later dispatched bodies, Indian wife killed and thrashed into pieces, Yogesh Malhotra killed wife

Man Killed His Wife, Scattered Body Parts All Around in his colony.

శవాన్ని పార్టు పార్టులుగా చేసి భయపెట్టాడు

Posted: 11/05/2016 09:28 AM IST
Man killed wife scattered body parts in colony

రాజస్థాన్ లోని అల్వారా ప్రాంతంలోని ఆర్య నగర్ కాలనీలో దీపావళి వేడుకలు సంబంరంగా జరుపుకుంటున్నారు అక్కడి వాసులు. అక్కడంతా మధ్యతరగతి కుటుంబాలు కావటంతో నిత్యం అంతా వారి వారి పనుల్లో మునిగిపోయి ఉంటారు. ఏదో పండక్కి పబ్బకి ఇరుగు పోరుగు వారు కలుసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఇంతలో తన ఇంటి ముందు ఉన్న ఓ బ్యాగ్ ను చూశాడు రత్నాకర్. దగ్గరగా వెళ్లి దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అంతే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే అందులో ఓ కాలిపోయిన మహిళ కుడి కాలు దర్శనమిచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనతో కాలనీ వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఆ తర్వాత మరుసటి రోజు మరో ఇంటి ముందు రెండు బ్యాగులు. ఈసారి అందులో రెండు చేతులు కనిపించాయి. ఇలా ఏడు రోజులపాటు ఇలా సంచుల్లో మహిళ శరరీ భాగాలు భయటపడటంతో కాలనీ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అప్పటికే రంగంలోకి దిగిన క్లూస్ చివరగా దొరికిన మహిళ తలను గుర్తించే పనిలో పడ్డాయి. కానీ, లాభం లేకపోయింది. దీంతో ఇంటి ఇంటికి తిరిగి విచారణ చేయటం ప్రారంభించింది.

చివరగా దీపావళి నుంచి తన భార్య కనిపించకుండా పోయినప్పటికీ ఫిర్యాదు చేయని యోగేష్ మల్హోత్రాపై పోలీసులకు అనుమానం కలిగింది. 35 ఏళ్ల యోగేష్, తన భార్యతో దీపావళి రోజు గొడవ పెట్టుకున్నాడని, అప్పటి నుంచే ఆమె కనిపించటం లేదని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాధానం అందించారు. అతడి చేతుల మీద కాలిన గుర్తులు, పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించటం, ఆపై హఠాత్తుగా ఇల్లు వదిలి పారిపోవటంతో పోలీసులు అతని కోసం వేట కొనసాగించారు. చివరకు హిస్సార్‌లో దాగున్న అతడిని పోలీసులు అరెస్టుచేశారు.

అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని, తనకు ఏదైనా అయితే తన కూతుర్ని ఎవరు చూసుకుంటారన్న బయంతో శరీరాన్ని ముక్కలుగా చేసి పారేయాలనుకున్నానని తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం అతడి వాదనను నమ్మడం లేదు. ఆర్తికి వేరే వారితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించడమే హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Alwan Man  killed wife  Scattered Body Parts  

Other Articles