వాట్ ఆన్ ఐడియా: వైఎస్ సమాధికి వినతిపత్రం | Kapu Ramanujaya Request document YSR tomb.

Kapu leader ramanujaya padayatra counter to mudragada

Kapu leader Ramanujaya's Padayatra, Ramanujaya at YSR ghat, Kapu Ramanujaya Request document YSR tomb, CBN Kapu counter, Mudragada Padayatra

AP CM chandrababu counter to Mudragada Padayatra and Jagan with Kapu leader Ramanujaya's Padayatra.

జగన్ కి కూడా ఇలాంటి థాట్ రాలేదేమో!

Posted: 10/31/2016 07:39 PM IST
Kapu leader ramanujaya padayatra counter to mudragada

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే చంద్రబాబును చూసి నేర్చుకోవాలేమో! కాపు సెగతో ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేస్తున్న ముద్రగడకు, వెనకాల నుంచి రెచ్చగొడతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న వైఎస్ జగన్ కు ఒకేసారి షాక్ లు ఇచ్చేందుకు బాబు సిద్ధమైపోతున్నాడు. ముద్రగడ ఏ రోజు నుంచి అయితే పాదయాత్ర చేస్తున్నారో అదే రోజు నుంచి కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కూడా బలిజ శంఖారావం పేరుతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

కాపు రిజర్వేషన్లపై ఇప్పటికే మంజునాథ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇప్పటికే కుల సంక్షేమం కోసం చాలా కృషి చేస్తున్నాడనే స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యాడు. అంతేకాదు ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా చాలా ప్రగతి చాలానే సాధించామని ప్రజలకు వివరిస్తారట. ఇందులో ఇంకో హైలెట్ ఏంటంటే... ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తుంటే.. రామానుజయ కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమవుతుంది.

ఆ లెక్కన రామానుజయ తన పాదయాత్రతో వైకాపా అధినేతను డైరక్ట్ టార్గెట్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే రామానుజయ ఈ పాదయాత్రలో ఇడుపుల పాయలోని 'వైఎస్ సమాధికి వినతిపత్రం' ఇచ్చేందుకు కూడా సిద్దమవుతున్నారట. వైఎస్ సమాధికి ఇచ్చే వినతిపత్రంలో బలిజ - కాపుల సంక్షేమానికి ప్రధాన అడ్డంకిగా ముద్రగడ - జగన్ ఉన్నారన్న అంశాలను పొందుపరిచారట.

ఏదేమైనా మారోసారి ముద్రగడ పాదయాత్రతో కాపులను రెచ్చగొట్టేందుకు వేసిన ప్లాన్ను చంద్రబాబు రామానుజయ పాదయాత్రతో చెక్ పెడుతున్నారన్న చర్చలు ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. బహుశా చంద్రబాబును విమర్శించే క్రమంలో జగన్ కి కూడా ఇలాంటి ప్రాక్టికల్ ఆలోచనలు వచ్చి ఉండవేమో కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu Padayatra  Chandrababu  Ramanujaya  YSR ghat  Jagan  Mudragada  

Other Articles

Today on Telugu Wishesh