సైనికులవి ప్రాణాలే కావన్న మాట! | Asaduddin Owaisi demands SC probe into Bhopal encounter

Asaduddin owaisi demands sc probe into bhopal encounter

Asaduddin Owaisi demands SC probe, MIM chief Bhopal Encounter, MIM Chief Owaisi SIMI encounter, Owaisi on Bhopal encounter, Asaduddin Owaisi army

Asaduddin Owaisi demands SC probe into SIMI activists encounter.

అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Posted: 10/31/2016 08:21 PM IST
Asaduddin owaisi demands sc probe into bhopal encounter

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తన స్వరాన్ని పెంచి, పోలీసులపై విరుచుకుపడ్డాడు. సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని ఒవైసీ ఆరోపించారు. భోపాల్ లో ఈ ఉదయం 8 మందిని టెర్రరిస్ట్ లను కేవలం 8 గంటల వ్యవధిలో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ను ఇనుప ప్లేట్లతో గొంతు కోసి చంపారనే జైలు సిబ్బంది చెప్పారు.

అయితే అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయని అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నాడు. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను వారు ప్రతిఘటించడంతో ఎన్ కౌంటర్ చేయక తప్పలేదని పోలీస్ అధికారులు చెబుతుండటం తెలిసిందే.

అయినా అసదుద్దీన్ మాత్రం విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు కదా. వికారుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాది గురించే సానుకూల వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం బాస్ కి ఉరి దాడి, సరిహద్దు ఉల్లంఘనలు కంటికి కనిపించడం లేదేమో! సరిహద్దులో పోయే జవాన్ల ప్రాణాల కన్న ఉగ్రరాక్షసుల ప్రాణాలే విలువగా కనిపిస్తున్నాయేమో!. సైనికులు చనిపోయినా దేశం మొత్తం స్పందిస్తుంటే... ఇప్పటిదాకా ఒక్క మాటా మాట్లాడలేదు. అదే ప్రజలను పొట్టనబెట్టుకునే మృగాలు చనిపోతే క్షణాల్లోనే స్పందించారు. అయినా ఐక్యతా దినోత్సవం రోజున కూడా చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన విచక్ష్క్షణ ప్రశ్నించే విధంగా ఉన్నాయనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయ్యా అసదుద్దీన్ సాబ్... మిమల్నేం సరిహద్దులకు వెళ్లి పోరాడమని కోరం... కానీ, అదే సమయంలో సైన్యం, పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినేలా మీరు మాట్లాడొద్దనే మా విన్నపం. 

చనిపోయిన వారంతా చాలా డేంజర్:
ఇక నలుగురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారని తమ దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. 2014 సెప్టెంబర్ 12న బిజ్ నోర్ లోని జాతన్ కాలనీలో ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉంటున్న ఆరుగురు వ్యక్తులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారు సిమి ఉగ్రవాదులే. అగ్గి పుల్లలకు ఉన్న మందును ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేసేవారు. ఆవిధంగా చేస్తున్నప్పుడే పేలుడు సంభవించిందనే విషయమై తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు.

ఇక ఆరుగురు సభ్యుల్లో నలుగురు జకీర్, అంజద్, సల్లూ,మహబూబ్ లు ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో ఇద్దరు అస్లాం, ఈజాజ్ లు ఈ ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.

Bhopal Encounter terrorists

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhopal SIMI encounter  MIM Asaduddin Owaisi fake  

Other Articles