‘కాపు’ కోసమే పవన్ ఏలూరు షిఫ్టింగ్ ? | Pawan Kalyan Decides to Get Registered As Voter in Eluru

Janasena cheif decides to get registered as voter in eluru

pawan kalyan Eluru, pawan care off eluru, Eluru pawan new home, Pawan New home in Eluru, Pawan Eluru plan, Kapu politics behind pawan Eluru shift

Janasena cheif Pawan Kalyan Decides to Get Registered As Voter in Eluru and settle there only.

ఇక నుంచి పవన్ కేరాఫ్ ఏలూరు

Posted: 10/31/2016 07:12 PM IST
Janasena cheif decides to get registered as voter in eluru

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక చక్రం తిప్పేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు కాగా, తాజా నిర్ణయంతో ఆ విషయం దాదాపు ఖరారైపోయింది. ఓటు హక్కుతోపాటు, ఇకపై సొంత నివాసం కూడా ఏలూరులోనే ఉండాలని పవన్ డిసైడ్ అయ్యాడు. సోమవారం తనను కలిసిన ఏలూరు అభిమానులు, కార్యకర్తల పవన్ ను కోరారంట. వెంటనే పవన్ సుముఖత వ్యక్తం చేశారు.

ఈ మేరకు అక్కడ ఓటు నమోదు చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని పార్టీ పరిపాలనా విభాగాన్ని పవన్ ఆదేశించారు. ఏలూరులో తన నివాసానికి అనుకూలమైన భవనాన్ని చూడాలని సూచించారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పవన్ కు ఓటు హక్కు, సొంత ఇల్లు ఉన్న సంగతి ఉంది.

అయితే జనసేన ఆఖరికి ఆంధ్రా పార్టీగా మిగిలిపోతుందన్న కొందరు విశ్లేషకుల అభిప్రాయానికి పవన్ తాజా నిర్ణయం ఆజ్యం పోసినట్లు అయ్యింది. కానీ, స్వ‌స్థ‌లం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ ఓటు హ‌క్కు ఆంధ్ర ప్ర‌దేశ్‌లోనే ఉండ‌డం స‌రైన‌ద‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు ప‌లుమార్లు ప‌వ‌న్‌ని సూచించటంతోనే ఇలా చేశాడని ఇంకొందరు అంటున్నారు. కాపు రాజకీయాలకు ఏలూరు కీలకం కావటంతోనే ఈ పని చేస్తున్నాడన్నది మరోవాదన. ఏది ఏమైనా ఈ లెక్కన తెలంగాణలో జనసేన దుకాణం దాదాపు క్లోజయ్యిందనే వారికి ఈ పరిణామాలు ఉతం ఇచ్చినట్లే అవుతుంది. మరి ఆ వాదనలలో పవన్ దేనికి ఓటేస్తాడో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eluru  Janasena chief Pawan Kalyan  Voter card  new home  

Other Articles