క్రైం పెట్రోల్ చూసి ఆ ఇంజనీరింగ్ లవర్స్ ఏం చేశారంటే... | Woman kidnaps her cousin with boyfriend

Woman kidnaps her cousin with boyfriend

Woman kidnaps her cousin, Rajasthan lovers kidnap cousin, Woman kidnaps her cousin with boyfriend

Woman kidnaps her cousin with boyfriend for lavish life.

క్రైం సీరియల్ చూసిన ఆ జంట ఏం చేసిందంటే...

Posted: 10/17/2016 11:58 AM IST
Woman kidnaps her cousin with boyfriend

టీవీ ప్రభావం ఎలా ఉంటుందో చూపించిన ఘటన ఇది. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే క్రైం కార్యక్రమంతో స్పూర్తి పొందిన ఓ జంట తాము చేసిన ప్రయత్నంతో కటకటాల పాలైంది. ప్రియురాలి తన లవర్ తో కలిసి ఏకంగా సొంత కజిన్ నే కిడ్నాప్ చేయబోయింది. రాజస్థాన్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్లితే... జోధ్‌ పూర్‌ కు చెందిన పూర్ణిషా సింధల్, ఆమె ప్రియుడు మయానక్ మెహతా ప్రేమికులు. అయితే తమకు లగ్జరీ లైఫ్ కావాలనుకున్న ఆ జంట డబ్బు కోసం తెగ ట్రై చేసింది.

ప్రతీ చోట అప్పులు చేయటంతో ఎవరూ మళ్లీ డబ్బు ఇఛ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో అవసరమైన డబ్బును వ్యాపారవేత్త అయిన పూర్ణిషా బాబాయ్ కొడుకు యుగ్ బండారిని కిడ్నాప్ చేయడం ద్వారా సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన పూర్ణిషా... తమ్ముడు యుగ్ ను కిడ్నాప్ చేసింది. ఆ తరువాత యుగ్ ను విడిచిపెట్టాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని పూర్ణిషా బాబాయ్ రితేష్ కు ఫోన్ లో డిమాండ్ చేయించింది. యుగ్ కు ఎక్కడ నష్టం చేస్తారోనని భయపడ్డ రితేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఛేదించారు.

కేవలం నాలుగు గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసు కొలిక్కి రావడం విశేషం. తాము ఓ టీవీ సీరియల్ ను చూసి స్పూర్తి పొంది ఈ కిడ్నాప్ చేశామని, అందులో బెదిరించగానే డబ్బులు తెచ్చి ఇస్తారని, అలాగే ఇక్కడ కూడా జరుగుతుందని భావించామని ఈ ప్రేమ జంట పేర్కొనడం విశేషం. వారిద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారని, మరో స్నేహితుడు భరత్ తో కలిసి ఈ పన్నాగం పన్నారని, అతని కోసం గాలిస్తున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Couple  Kidnap  Cousin  Lavish Life  

Other Articles