కావేరి జలాలు రైళ్లను అపేస్తున్నాయి... Cauvery row: 48-hour rail roko may hit services

Opposition parties stage rail roko across tamil nadu

Cauvery issue, Cauvery issue news, Rail Roko, DMK, AIADMK, Tamil Nadu, Karnataka, Cauvery conflict, Rail Roko demonstration, MK Stalin, Cauvery Water Management Board, Cauvery dispute, Delta farmers organisdations, 48-hour rail roko, India, Tamil Nadu, water, community water management, water rights

Keeping its pressure on the ruling AIADMK over the Cauvery conflict, a 48-hour rail roko agitation called by the farmers' organisations on October 17 and 18 started in Chennai.

ITEMVIDEOS: రగలుతున్న ‘కావేరి’ కార్చిచ్చు...

Posted: 10/17/2016 11:51 AM IST
Opposition parties stage rail roko across tamil nadu

కావేరి జలాల కోసం రెండు రాష్ట్రల మధ్య ప్రారంభమైన ఉద్యమాల కార్చిచ్చే ఇంకా రగులుతూనే వుంది. తమ అవసరాలకు కూడా నీళ్లు లేవని ఇలాంటి పరిస్థితుల్లో తాము నీటినెలా విడుదల చేస్తామని ఏకంగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే తమ వాదనను వినిపించిన కర్ణాటక ప్రభుత్వానికి న్యాయస్థానం అల్టిమేటం మధ్య నీటిని విడుదల చేయించింది. అయితే ఎంత మేరకు నీటిని విడుదల చేశారన్నది మాత్రం గోప్యంగా వుంచింది.

దీంతో న్యాయస్థానం అదేశాల మేరకు తమిళనాడుకు కావేరి జలాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా రైలురోకో చేపట్టింది. విపక్షనేత, డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లకు చేరుకుని రైలురోకో చేపట్టారు. కావేరి బోర్డు, కమిటీ సాధన లక్ష్యంగా కేంద్రంపై కన్నెర్ర చేస్తూ రైల్వేస్టేషన్ల ముట్టడికి రాజకీయ పక్షాలతో పాటు ప్రజాసంఘాలు, రైలు సంఘాలు యత్నించాయి. అయితే రంగంలోకి దిగిన పోలీసుల, రైల్వే సోలీసులు పలు చోట్ల విపక్ష నేతలను అరెస్ట్ చేశారు.

కావేరి బోర్డు ఏర్పాటులో తమ ప్రమేయం వుండదని, ట్రిబ్యూనల్ ఇచ్చిన ప్రతిపాదనను అచరించాలని తాము కేంద్రాన్ని అదేశించలేమని, ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో విపక్ష పార్టీలు అందోళనకు పిలుపునిచ్చాయి. కేంద్రం తమ రాష్ట్రాన్ని ఎడారిలా మార్చుతుందని అందకనే బోర్డు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని ప్రతిపక్షాలు అరోపించాయి.

దీంతో 48 గంటల రైల్ రోకోకు పిలుపునిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండువందల చోట రైల్వేస్టేషన్ల ముట్టడికి యత్నించాయి. కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం మాటమార్చి వ్యవహరిస్తుందని ధ్వజమెత్తాయి. ప్రతిపక్షం డీఎంకేతో పాటు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటు వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : River Cauvery  water  community water management  water rights  Tamilnadu  opposition parties  

Other Articles