ట్రంప్ కార్యాలయంపై బాంబుదాడి.. రాజకీయ ఉగ్రవాదమట Republican HQ in Orange County firebombed

Trump clinton condemn firebomb attack on republican party office

us presidential elections, bomb attack, Republican Party office, North Carolina, Hillary Clinton, Donald Trump

Hillary Clinton and Donald Trump issued two contrasting responses to the vandalizing and apparent firebombing of a Republican Party headquarters in North Carolina

ITEMVIDEOS: ట్రంప్ కార్యాలయంపై బాంబుదాడి.. రాజకీయ ఉగ్రవాదమట

Posted: 10/17/2016 11:45 AM IST
Trump clinton condemn firebomb attack on republican party office

ఎంతో హుందాగా జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇప్పటికే ఇరువురు అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు చెందిన పలు రహస్య వీడియోలు, అడియో టేపులను లీక్ చేస్తూ.. దిగజారిన రాజకీలయాలకు పాల్పడుతూ.. తమ చివరి అంకానికి చెందిన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో 'రాజకీయ ఉగ్రవాదం'గా పరిగణిస్తోన్న దుశ్చర్య అమెరికాలో కలకలం రేపింది.

అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు చెందిన పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారని, కిటికీ గుండా ఆఫీసులోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా కాలిపోయిందని ప్రకటించిన పోలీసులు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.

అంతటితో అగని ముష్కరులు.. ఘటనా స్థలానికి అతి సమీపంలోని ఓ మూసి ఉన్న దుకాణంపై హెచ్చరికలు కూడా చేశారు. 'నాజీ రిపబ్లికన్లారా.. వెళ్లిపొండి. లేకుంటే..' అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనను రిపబ్లికన్ పార్టీ 'రాజకీయ ఉగ్రవాదం'గా అభివర్ణించింది. ప్రత్యర్థి పార్టీ తమకు వస్తున్న అదరణను తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడిందని అరోపించింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేసి 'హిల్లరీని సమర్థిస్తున్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి'అని అన్నారు.

ఎన్నికల్లో కీలకమైన ఉత్తర కరొలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని, కొన్ని జంతువులు ఆమె తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అరోపించారు. బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మర్చిపోమని, ఉత్తర కోరొలినాలో తమ గెలుపును ఎవరు అడ్డకోలేరని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కాగా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ బాంబు దాడిని ఖండించారు. ఈ భయానంక దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles