ట్రంప్ మాటలతో కాలిన నల్లోడు ఏం చేశాడో చూడండి | Donald Trump’s New Hotel Was Hit With Black Lives Matter

Donald trump s new hotel was hit with black lives matter

Donald Trump’s New Hotel Was Hit With Black Lives Matter, Black Marks for Donald Trump, Donald Trump hotel targeted by Black Man, Donald Trump Black Comments

Donald Trump’s New Hotel Was Hit With Black Lives Matter.

ట్రంప్ ఖాతాలోకి బ్లాక్ మార్క్ కూడానా?

Posted: 10/03/2016 10:30 AM IST
Donald trump s new hotel was hit with black lives matter

అమెరికాలో నల్లజాతీయుల సెగ అధ్యక్ష ఎన్నికలకు తాకింది. ప్రచారంలో భాగంగా నల్ల జాతీయుల పట్ల డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న విధానం, చేస్తున్న వ్యాఖ్యలతో వారికి చిర్రెత్తుకుపోయినట్లు ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవబోనివ్వమన్న సంకేతాలు ఆ జాతీయులు అందజేస్తున్నారు. తాజాగా ట్రంప్ హోటల్ పై జరిగిన దాడి దీనిని స్పష్టం చేస్తోంది.

రాజధాని వాషింగ్టన్ లో కొత్తగా ప్రారంభించిన ఓ లగ్జరీ హోటల్ గోడలపై రాతలు రాసేశారు. తమకు అన్యాయం, అశాంతి కలుగుతున్నాయని, నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించిన... అని అర్థం వచ్చేలా గోడలపై రాతలు రాసేశారు. ఈ పని ఎవరు చేశారన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.

 కాగా, శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ట్రంప్ హోటల్ పై నినాదాలు రాసి, తాపీగా మెట్లు దిగి నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయమై స్పందించేందుకు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రతినిధులు నిరాకరించారు. ఈ ఘటన తరువాత హోటల్ ముందు సెక్యూరిటీని పెంచినట్టు వివరించారు.

కాగా, రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, నల్లజాతీయుల పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలే చేస్తున్నాడు. కాగా, మొత్తం 263 రూములున్న ఈ హోటల్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ ఓ రాత్రి గడపాలంటే, 400 డాలర్లను వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్ వాషింగ్టన్ కు ఎప్పుడు వచ్చినా, ఇక్కడే బస చేసి, తన ప్రచార టీమ్ తో మంతనాలు జరుపుతారు. ఈ క్రమంలోనే వారు ఆ హోటల్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Washington  Hotel  Black Marks  

Other Articles