షార్ లో హైఅలర్ట్.. సిఐఎస్ఎఫ్ పహారా కట్టుదిట్టం.. high alert at ISRO, security beefed up

High alert at isro security beefed up

satish dhawan space centre, pakistan terrorists, isro, shar, security, cisf, Manohar Parrikar, military camps, defence equipment, defence sectors, Defence Minister, nellore Isro center, sea, SHAR, satish dhawan space center, Sriharikota, high alert,

India is now beefing up security around military camps and equipment and defence sectors, Defence Minister Manohar Parrikar said. He also said that the country was "fully prepared for any escalation".

షార్ లో హైఅలర్ట్.. సిఐఎస్ఎఫ్ పహారా కట్టుదిట్టం..

Posted: 10/03/2016 09:44 AM IST
High alert at isro security beefed up

ఉరి బేస్ క్యాంప్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడి 19 మంది భారత ఆర్మ జవాన్లను హతమార్చిన నేపథ్యంలో పాక్ భూభాగంలోకి చోచ్చుకెళ్లిన భారత రక్షణ బలగాలు సునిశిత దాడులకు తెగబడి 40 మంది ఉగ్రవాదులతో పాటు వారి బంకర్లను కూడా ద్వంసం చేసిన నేపథ్యంలో ప్రతీకారంతో రగలిపోతున్న ఫియాద్దీన్ ఉగ్రవాదులు ఏకంగా భారత ఆర్మీకి సంబంధించిన స్థావరాలపై దాడులకు తెగబడతారన్న సమాచారంతో భారత్ అప్రమత్తం అయ్యింది. దేశంలోని అన్ని రక్షణ శాఖకు సంబంధించిన కేంద్రాల వద్ద భారీ పహారాను ఏర్పాటు చేశారు.

మరోవైపు పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైనికులు వెళ్లేందుకు ఇస్రో దోహదం చేసిందన్న వార్తలు వెలుగులోకి రావడంతో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం  చేశారు. ఇస్రోపై పాకిస్థాన్ తీవ్రవాదులు దాడులకు తెగబడవచ్చునన్న ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో కూడా హైఅలర్గ్ ప్రకటించారు. షార్‌కు నిత్యం పహారా కాస్తున్న కేంద్ర ప్రాథమిక భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ సుభాష్‌ సిన్హా తెలిపారు. హైఅలర్ట్‌తో సిబ్బంది నిత్యం మరో మూడు గంటలపాటు అదనంగా విధులు నిర్వహిస్తున్నారు.

సముద్ర తీర ప్రాంతంలో మెరైన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. షార్‌ ఐల్యాండ్‌కు దక్షిణాన పల్‌వేరికాడ్‌ వైపు, ఉత్తరాన రాయదొరువు వైపు, సముద్రతీరప్రాంతం వైపు ప్రత్యేకంగా సాయుధ దళాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి భద్రతా సిబ్బందితో నాలుగు మొబైల్‌ పార్టీలను గస్తీ ఏర్పాటు చేశారు. బకింగ్‌హాం కెనాల్, అటకానితిప్ప, షార్‌ పరిసర ప్రాంతాల్లోనూ గస్తీని ముమ్మరం చేశారు. పులికాట్‌ సరస్సులో, బంగాళాఖాతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని జాలర్లకు ఆదేశాలిచ్చారు. షార్‌లోకి అపరిచిత వ్యక్తులు చొచ్చుకు రాకుండా చూసేందుకు కూడా సరిహద్దుల్లో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satish dhawan space centre  pakistan terrorists  isro  shar  security  cisf  Manohar Parrikar  

Other Articles