అగిడినోళ్లకల్లా జిల్లా.. మొత్తంగా 30 చేరుకోనున్న సంఖ్య.. Increase inTelangana districts, Shamshabad to be Ranga Reddy district

Increase intelangana districts shamshabad to be ranga reddy district

అగిడినోళ్లకల్లా జిల్లా.. మొత్తంగా 30 చేరుకోనున్న సంఖ్య..

Posted: 10/03/2016 10:06 AM IST
Increase intelangana districts shamshabad to be ranga reddy district

తెలంగాణ రాష్ట్రంలో మాకు జిల్లా కావాలంటూ అందోళనకు దిగిన ప్రతీ ఒక్కరిని సంతృప్తి పర్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. జిల్లాల పునర్విభజనకు ముందు ఏ మాత్రం ప్రజా వ్యతిరేకత లేని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంతో ముప్పేటదాడిని ఎదుర్కోంది. దీంతో ప్రతిపక్షాల నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడిగన వారికల్లా జిల్లాను, మండలాలను మంజూరు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్ అధికారులకు అదేశాలు ఇచ్చేశారు.

దీంతో నూతనంగా ఏర్పాటవుతున్న జిల్లాల సంఖ్య 17 నుంచి 20 చేరుకోగా తెలంగాణలో మొత్తంగా 30 జిల్లాలు అవిష్కృతం కానున్నాయి. ప్రతిపాదిత 17 జిల్లాలకు అదనంగా వచ్చి చేరిన మూడు జిల్లాల జాబితాలో గద్వాల, సిరిసిల్ల, జనగామలు వున్నాయి, దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని యోచిస్తున్న ప్రభుత్వం అదే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకు మరి కొన్ని రోజులే గడువు ఉన్న సమయంలో తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కేవి రంగారెడ్డి పేరును ఏర్పడిన జిల్లాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా వుంది. ఈ నేపథ్యంలో పెద్దమంగళారం వచ్చే చేవెళ్ల నియోజకవర్గం శంషాబాద్ జిల్లా పరిధిలోకి వస్తున్న తరుణంలో శంషాబాద్ జిల్లా పేరును రంగారెడ్డిగా మార్చాలని, ఇక ప్రస్తుతమున్న రంగారెడ్డి పశ్చిమ ప్రాంతాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడుతున్నజిల్లా పేరును అనంత పద్మనాభ స్వామి పేరున అనంతగిరి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటికి అదనంగా మరో మూడు కలపడం వల్ల జరిగే నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles