వీడియో:రక్తపు మడుగులో నర్సును వదలని చిన్నారి | a blood soaked Aleppo boy refuses to let go of a nurse

A blood soaked aleppo boy refuses to let go of a nurse

a blood soaked boy refuses to let go of a nurse, Another Aleppo Baby Boy Video, Russian airstrike in Aleppo, Russian Army Huge Damage in Syria, Syria Russia, Syrian Kids situation, Syrian Kid Video, Kid cry hug Nurse

a blood soaked boy refuses to let go of a nurse after his house was hit by an airstrike in Aleppo.

ITEMVIDEOS:రక్తపు మడుగులో చిన్నారులు అక్కడ మాములే...

Posted: 10/01/2016 12:23 PM IST
A blood soaked aleppo boy refuses to let go of a nurse

తలకు గాయంతో రక్తపు మడుగులో ఓ చిన్నారి.. తనకు తగిలిన గాయంకంటే... తనకు జరిగిన నష్టం కూడా ఎంత పెద్దదో(కుటుంబాన్ని కోల్పోయాడు), అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఏడూస్తూనే ఉన్నాడు. ఆ నర్సు ట్రీట్ మెంట్ పూర్తి చేసి, పక్కనే ఉన్న ఓ వ్యక్తికి అప్పజేప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ, ప్రాణ భయం పోని ఆ పిల్లాడు ఏడుస్తూ నర్సును వదలకుండా హత్తుకుపోయాడు. అలెప్పోలో ఓ కాలనీ లో జరిగిన దాడిలో ఓ చిన్నారి కాదు కాదు... అలా పదుల సంఖ్యలో చిన్నారులు భయానక పరిస్థితి నుంచి బయటపడిన క్షణాలు ఇలా హృదయ విదారకంగా ఉన్నాయి.

ఇది సిరియాలో చిన్నారుల పరిస్థితి ఎంతలా ఉందో తెలిపే ఓ ఉదాహరణ మాత్రమేనని వీడియోను నెట్ లో అప్ లోడ్ చేసిన సిరియన్ అమెరికన్ మెడికల్ సోసైటీ(శామ్స్) పరిస్థితి తీవ్రతను వివరిస్తోంది. గతంలో ఇలాంటి ఫోటోలు, వీడియోలు చాలానే వచ్చినప్పటికీ తాజా దాడితో పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యిందని వివరిస్తోంది.

ఇక అలెప్పోలో తాజాగా జరిగిన ఈ దాడిని, చేసింది రష్యన్ సైన్యమో, లేక సిరియన్ ప్రభుత్వమో తెలీదు. కానీ, 13 మంది చనిపోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని శామ్స్ పేర్కొంది. గత ఐదేళ్లుగా ఈ సోసైటీ 40కి మంది పైగా వైద్యలతో అక్కడ సేవలు అందిస్తోంది.

కాగా, గతేడాది నుంచి రష్యన్ సైనికులు చేస్తున్న గగనతల దాడులతో 3,800 మంది సాదారణ ప్రజలు మృతి చెందినట్లు అంతర్జాతీయ మానవహక్కుల పర్యవేక్షణా సంస్థ నివేదికలు చెబుతున్నాయి. వీరిలో 2,337 మంది పురుషులు, 906 మంది చిన్నారులు, 561 మంది మహిళలు ఉన్నారు.

అదే సమయంలో రష్యన్ ఆర్మీ 2,746 ఐసిస్ ఉగ్రవాదులను, 2.814 రెబల్స్ ను మట్టిలో కలిపిందని అందులో పేర్కొంది. సిరియా విషయం చాలా సున్నితమైందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైలెంట్ గా ఉన్న సమయంలోన, రష్యా మాత్రం శాంతి సాధన పేరిట సిరియా గగనతలం నుంచి యుద్ధ కాండను కొనసాగిస్తూనే ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A blood soaked  Aleppo  kid  Hug  Nurse  

Other Articles