కొడుకు పెళ్లిపై పిట్టకథ బాగా పేలింది | venkaiah naidu pitta katha on congress over package issue

Venkaiah naidu pitta katha on congress over package issue

venkaiah naidu Koduku Pelli pitta katha, Venkaiah Naidu Pitta Katha, Venkaiah Naidu satire on congress, venkaiah Naidu Pitta Katha, Venkaiah Naidu speech at BEL opening

venkaiah naidu Koduku Pelli pitta katha on congress over package issue.

కొడుకు పెళ్లికి కాంగ్రెస్ తో ముడిపెట్టాడు

Posted: 09/19/2016 05:19 PM IST
Venkaiah naidu pitta katha on congress over package issue

సాధారణంగానే ఛలోక్తులు విసిరే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా వ్యవహారంలో తనపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కాస్త సెటైరిక్ గా స్పందించాడు. సోమవారం బెల్ శంకుస్థాపన అనంతరం స్టేజీపై ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొడుకు పెళ్లి పిట్ట కథ అక్కడున్నవారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

50 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమకు ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారని, కాంగ్రెస్ వారు 2019 వరకూ ఆగాలని హితవు పలికాడు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏం చేయలేకపోయినా కాంగ్రెస్ వాళ్లు వచ్చే ఎన్నికల కోసం అన్నట్లుగా విమర్శలకు దిగుతున్నారంటూ కథ మొదలు పెట్టారు. "వెనకటికి ఒకాయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేయాలని తండ్రి వద్ద గొడవ పెడుతున్నాడు. వాళ్ల నాయన అప్పుడే టైం కాలేదురా, వద్దురా తొందర పడమాకురా అన్నాడట. లేదు నాకు తొందరగా పెళ్లి కావాలి అంటూ ఊళ్లో వాళ్లందరికీ చెప్పాడట వెళ్లి... అయ్యా మా నాయిన నేను చెబితే పెళ్లి చేయడం లేదు. తొందరగా నాకు పెళ్లి అయ్యేట్టు చూడమని. ఆపై ఊళ్లో వాళందరూ వెళ్లి చెప్పారట. మీ అబ్బాయికి అంత హుషారుగా ఉంటే తొందరగా పెళ్లి చేయవయ్యా అని. దీంతో వాడికి పెళ్లి చేశారు.

పెళ్లి చేసిన తరువాత రెండేళ్లయిపోయింది. ఏం కాలేదు. మూడేళ్లయింది ఏం కాలేదు... (ఆ సమయంలో చంద్రబాబు, ఆయన పక్కనున్న సుజనా చౌదరి నవ్వాపుకోలేకపోయారు...) ఐదేళ్లయింది ఏం కాలేదు. పదేళ్లయింది ఏం కాలేదు. ఏందిరా అంత గొడవ జేస్తివి, మీ నాయన ప్రాణం తీస్తివి? పదేళ్లయినా ఇంకా ఏం కాలేదంటే ఎలారా? అంటే నాకు ఇంకో చాన్సిచ్చి చూడండి, ఈ సారి చూపిస్తా నా తడాఖా అన్నాడట" అంటూ నవ్వించారు. 'ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులంతా, ఆ కేటగిరీకి చెందిన వాళ్లే. అర్థం చేసుకోండి' అంటూ తన పిట్టకథను ముగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Congress  Pelli Koduku  Pitta Katha  

Other Articles