బీహార్ ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య Bihar tragedy, 40 killed as bus falls into roadside pond in Madhubani

Bihar tragedy 40 killed as bus falls into roadside pond in madhubani

bihar, bihar bus accident, bus accident bihar, four killed bihar bus accident, forty killed, madhubani, bennipatti police station, basaitha chowk accident, crime

At least 40 passengers were killed when a bus fell into a roadside pond in Bihar’s Madhubani district. The accident took place at Basaitha chowk under Bennipatti police station.

బీహార్ ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య

Posted: 09/20/2016 08:28 AM IST
Bihar tragedy 40 killed as bus falls into roadside pond in madhubani

బీహార్‌లోని మధుబని జిల్లా బస్కాచౌ గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. 65 మంది ప్రయాణికులతో సీతామరి నుంచి మధుబనికి వెళ్తున్న బస్సు బసైతా చౌక్ వద్దకు రాగానే అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 27 మంది జలసమాధి అయ్యారు. కొందరు ప్రయాణికులు వెంటనే తేరుకుని ఈదుకుంటూ ఒడ్డుకొచ్చారు. మరికోందరు గాయాలపాలు కాగా, వారిని అస్పత్రికి తరలించారు. కాగా మరికోందరు గల్లంతయ్యారు.

ఘటన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ప్రమాదస్థలానికి చేరకుని బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికి తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఆలస్యంగా మొదలు కావడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. బాధితులకు సత్వర సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles