పాక్ పై యుద్ధానికి సన్నాహాలు ... సైన్యం సంకేతాలు | Army to turn on heat asks government to consider cross border strikes

Army to turn on heat asks government to consider cross border strikes

Army to turn on heat Uri Attack, government to consider cross border strikes, uri Attack Revenge, India Revenge on Uri Attack, Army ready for War, Pak uri Attack, Uri Attack revenge, Indian Army after Uri Attack, Vijender Singh Uri Attack

Army to turn on heat asks government to consider cross border strikes.

ఆర్మీ అలర్ట్ : పాక్ తో యుద్ధం తప్పదా?

Posted: 09/19/2016 11:50 AM IST
Army to turn on heat asks government to consider cross border strikes

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్మీ బెటాలియన్లు, భారత వాయుసేన నిర్వహణలో ఉన్న ఎయిర్ బేస్ స్టేషన్లు 'ఫుల్ అలర్ట్'తో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విమానాలు, సైనికులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మయన్మార్ లో జరిపిన 'సర్జికల్ స్ట్రయిక్స్' వంటి కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్ చేసే ఉద్దేశం భారత ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేనట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ లోని ఆర్మీ పోస్టులపై భీకర దాడులు చేయడం, వారి బంకర్లను ఇవతలి వైపు నుంచే సర్వ నాశనం చేయడం, హెవీ మోటార్లు ఉపయోగించి కాల్పులు జరపడం, తేలికపాటి క్షిపణులతో పాక్ సరిహద్దు భద్రతా స్థావరాలను చిన్నాభిన్నం చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అమలు జరిపిన పద్ధతుల్లోనే పాక్ కు గట్టి బుద్ధి చెప్పేలా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

మరోవైపు సరిహద్దులు దాటకుండా పాకిస్థాన్ రక్తం కళ్లజూడాల్సిందేనని వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులు గట్టి పట్టుతో ఉన్నారు. ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది. 'పరిమితమైన సీమాంతర దాడి'కి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా యూరి దాడితో దేశం మొత్తం రగిపోతుంది. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటే యుద్ధం చేయాల్సిందేనని ముక్తకంఠంతో కోరుతోంది.

ఇక సీమాంతర దాడికి ప్రభుత్వం అనుమతిస్తే, అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు లేకపోలేదు. దీంతో కేంద్రం ఇప్పటికిప్పుడు అలాంటి అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పఠాన్ కోట్, యూరీ ఆర్మీ పోస్టులపై ఉగ్రదాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ కు బుద్ధి చెప్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uri Attack  India  Revenge  Declare War  Pakistan  

Other Articles