భాగ్యనగరంలో వరుణుడి ప్రతాపం | heavy rains hit in Hyderabad

Heavy rains hit in hyderabad 7 died

Heavy rains hit in Hyderabad, 4 died in collapse wall due to rain, heavy rain wall collapse 4 died, 4 died for rains in Hyderabad, 15 years rain in three days, heavy rains in Hyderabad

Heavy rains hit in Hyderabad. officials alert people for three days. 4 died in collapse wall in Hyderabad.

ITEMVIDEOS:భాగ్యనగరంలో దంచి కొడుతున్న వరుణుడు.. ఏడుగురు మృతి!

Posted: 08/31/2016 10:50 AM IST
Heavy rains hit in hyderabad 7 died

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోటి, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపుల్, గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, బేగంపేట, బోయిన్‌పల్లి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతపూర్, మన్సూరాబాద్, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, రాజేంద్రనగర్... ఇలా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇక వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రామాంతపూర్, భోలక్ పూర్ రెండు చోట్ల గొడలు కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పనుల్లో ఉండగానే ఈ ఘోరం సంభవించింది. నగరంలో కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నాం 12 గంటల వరకు ఎవరినీ ఇంటిలో నుంటి బయటకు రావద్దంటూ సూచనలు చేశారు.

hyderabad heavy rains

కుంభవృష్టికి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒక్కసారిగా నాలుగు అడుగులకు పైగా పెరిగింది. బంజాసాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వరదగా మారి హుస్సేన్ సాగర్ లోకి ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగింది. మరో రెండు అడుగుల నీరు చేరితే, గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదలాల్సి వుంటుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రాజ్ భవన్ సమీపంలో రైలు పట్టాలపై భారీగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.

chicks on chappal

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగిలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. ఇబ్రహీంపట్నంలో రహదార్లు జలమయమయ్యాయి. తాండూరు, వికారాబాద్‌లలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు రాబోయే మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

కేసీఆర్ దిగ్భ్రాంతి
జంట నగరాలలో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Heavy Rains  4 died  

Other Articles