కారు ఎగిరి కుక్క ప్రాణాలు నిలిచాయి | Dog miraculously escapes getting hit by rally car

Dog miraculously escapes getting hit by rally car

Lucky Dog, Car jumps on Dog, Dog escaped in Race, Dog in Car Race, Car Race Dog interruption, Dog Interruption Car race, Lucky Dog, Dog escaped in accident, dig accident

Dog miraculously escapes getting hit by rally car in Bolivia.

ITEMVIDEOS:ఆ కుక్క చాలా లక్కీ గురూ... కావాలంటే చూడండి

Posted: 08/31/2016 10:25 AM IST
Dog miraculously escapes getting hit by rally car

అదృష్టం అంటే నిజంగా ఆ కుక్కదే. ప్రాణాలు పోవటం ఖాయమనుకున్న అద్దుతం జరిగి చిన్న గాయం కూడా కాకుండా అది తప్పించుకుంది. కాస్తుంటే తునాతునకలైపోవాల్సిన ఆ శునకం ఆశ్చర్యకరంగా తప్పించుకోవడం మిరాకిలే. ఈ వీడియో చూశాక దీనంత అదృష్టవంతురాలు ప్రపంచంలోనే మరొకటి ఉండదని మీరు అంటారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. సెలవుదినం కావడంతో ఆదివారం బొలీవియాలో ‘కొడాసర్- 2016’ పేరుతో కార్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చిన్నారుల దగ్గరి నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతుకుల మట్టిరోడ్డుపై ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నాయి. కార్లు మెరుపువేగంతో దూసుకుపోతున్నాయి. రయ్ మంటూ కార్లు రోడ్డుపై దూసుకెళ్తుండడంతో భయపడిన ఓ శునకం రోడ్డుపైకి వచ్చి పరుగులు తీస్తోంది. ఈలోగా మరోకారు వేగంగా దూసుకువస్తోంది. దీనిని చూసినవారు కాసేపు భయపడ్డారు. కుక్క మీది నుంచి కారు దూసుకుపోవడం ఖాయమని అనుకున్నారు.

 

ఈ దారుణాన్ని చూడడం ఇష్టం లేని కొందరు కళ్లు మూసుకున్నారు. సరిగ్గా అప్పుడే జరగరాని అద్భుతం జరిగింది. సరిగ్గా శునకాన్ని సమీపిస్తున్న తరుణంలో కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కుక్కను దాటాక నేలపై పడింది. దీనిని చూసినవారు ఆనందాశ్చర్యాలతో కేరింతలు కొట్టారు. చనిపోతుందనుకున్న శునకం అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండానే తన దారిన తాను వెళ్లిపోయింది. కారు యథావిధిగా అదే వేగంతో దూసుకుపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bolivia  Car Race  Dog  miracle  escaped  car  jumped  

Other Articles